Site icon NTV Telugu

Earthquake: అమెరికాలో భూకంపం.. రిక్టర్ స్కేల్‌పై 6.2 నమోదు

Earthquake

Earthquake

అమెరికాలో భూకంపం సంభవించింది. ఒరెగాన్ తీరంలో 6.2 తీవ్రతతో భూకంపం చోటుచేసుకుంది. ఈ మేరకు జర్మన్ రీసెర్చ్ సెంటర్ ఫర్ జియోసైన్సెస్ (GFZ) తెలిపింది. ఒరెగాన్‌లోని న్యూపోర్ట్‌కు పశ్చిమాన 170 మైళ్ల దూరంలో ఈ భూకంపం సంభవించి. భూప్రకంపనలతో పసిఫిక్ వాయువ్య ప్రాంతాన్ని కుదిపేసింది. అయితే ఆస్తి, ప్రాణ నష్టం గురించి ఎలాంటి వివరాలను అధికారులు వెల్లడించలేదు.

ఇది కూడా చదవండి: Gold Rates: కనుమ రోజున పసిడి ప్రియులకు శుభవార్త.. ఈరోజు ధరలు ఇలా..!

యునైటెడ్ స్టేట్స్ జియోలాజికల్ సర్వే (USGS) ప్రకారం.. బాండన్ నుంచి 183 మైళ్ల దూరంలో.. సేలం నుంచి పశ్చిమాన 261 మైళ్ల దూరంలో 4.4 మైళ్ల లోతులో భూకంప కేంద్రం ఉందని పేర్కొంది. ఈ ప్రాంతం అంతటా బలమైన ప్రకంపనలు నమోదయ్యాయని తెలిపింది. బలమైన ప్రకంపనలను నమోదైనట్లు వెల్లడించింది. భూప్రకంపనలకు నివాసితులు భయభ్రాంతులకు గురయ్యారు.

ఇది కూడా చదవండి: Stock Market: బీఎంసీ ఎగ్జిట్ ఫలితాలు ఎఫెక్ట్.. భారీ లాభాల్లో సూచీలు

Exit mobile version