జెన్-జెడ్ ఉద్యమంతో నేపాల్ అల్లకల్లోలం అయింది. కనీవినీ ఎరుగని రీతిలో నేపాల్ రాజధాని ఖాట్మండు విధ్వంసానికి గురైంది. దేశంలో నాయకుల అవినీతి కారణంగా యువతలో తీవ్ర ఆగ్రహావేశాలు రగిలించింది. దీంతో జెన్-జెడ్ ఉద్యమం పేరుతో యువత చెలరేగిపోయింది. ప్రభుత్వ కార్యాలయాలు, ప్రభుత్వాధినేతల ఇళ్లు లక్ష్యంగా నిరసనకారులు చెలరేగిపోయారు. ధ్వంసం చేయడంతో పాటు ఆస్తులను తగలబెట్టేశారు. దీంతో ఆస్తులన్నీ మంటల్లో తగలబడిపోయాయి. కోట్లాది రూపాయల ఆస్తి నష్టం జరిగింది. దీంతో దేశ ముఖ చిత్రమే పూర్తిగా మారిపోయింది.
ఓ వైపు నేపాల్‌లో నిరుద్యోగం, ద్రవ్యోల్బణం, పేదరికంతో ప్రజలు విలవిలలాడుతుంటే ప్రముఖుల పిల్లలు మాత్రం లగ్జరీ లైఫ్ అనుభవిస్తున్నారు. విదేశీ యాత్రలకు వెళ్తూ విలాసవంతమైన జీవితాన్ని గడుపుతున్నారు. పేదోళ్లు రక్తం చిందించి.. చెమటోడ్చి పన్నలు కడుతుంటే.. ప్రముఖుల పిల్లలు మాత్రం సుఖభోగాలు అనుభవిస్తూ దర్జాగా బ్రతుకుతున్నారు. ఇదే యువతలో ఆగ్రహాన్ని రగిలించింది.
తాజాగా ప్రముఖల ఇళ్లల్లో ఏం జరుగుతుందో కళ్లకు కట్టినట్లుగా దృశ్యాలు వెలుగులోకి వచ్చాయి. మంత్రుల పిల్లలు విలాసవంతమైన జీవితం అనుభవిస్తున్నట్లుగా కనిపించింది. డిజైనర్ బ్యాగులు, లగ్జరీ కార్లు, విదేశీ యాత్రలు, ఆడంబరమైన జీవనశైలికి సంబంధించిన చిత్రాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇవే నిరసనకారుల్లో అశాంతికి ఆజ్యం పోసింది. కడుపు మండిన ఆందోళనకారులు ప్రముఖుల ఇళ్లు లక్ష్యంగా విధ్వంసం సృష్టించారు. ఆస్తులన్నీ కాలి బుడిదయ్యాయి.
ఇది కూడా చదవండి: US: డల్లాస్‌లో ఘోరం.. భారత సంతతి వ్యక్తి హత్య.. తల నరికి చెత్తకుప్పలో విసిరివేత
ప్రభుత్వంలో జరుగుతున్న అవినీతిపై జెన్-జెడ్ ఉద్యమం సోషల్ మీడియాలో ఉధృతంగా సాగుతోంది. అయితే కేపీ శర్మ ఓలి ప్రభుత్వం సోషల్ మీడియాపై నిషేధం విధించింది. ఇది మరింత ఆగ్రహాన్ని రగిలించింది. అంతే ఉద్యమకారులంతా రోడ్డెక్కారు. దాదాపు 10 వేల మంది నిరసనకారులు ఒక్కసారిగా ఖాట్మండులో విధ్వంసం సృష్టించారు. మంత్రులను లక్ష్యంగా దాడులు చేశారు. దీంతో వణికిపోయిన ప్రభుత్వాధినేతలు పదవులకు రాజీనామా చేశారు. అలాగే ప్రధాని ఓలి కూడా రాజీనామా చేసి అదృశ్యమైపోయారు.
ఇది కూడా చదవండి: Gold Rates: గోల్డ్ లవర్స్‌కు బిగ్ షాక్.. భారీగా పెరిగిన ధరలు
