NTV Telugu Site icon

London: విద్యుత్ సబ్‌స్టేషన్‌లో భారీ అగ్నిప్రమాదం.. హీత్రో ఎయిర్‌పోర్టు మూసివేత

Majorfirelondon

Majorfirelondon

లండన్ విద్యుత్ సబ్‌స్టేషన్‌లో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. దీంతో వందలాది కుటుంబాలకు విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో అంధకారం అలుముకున్నాయి. ఇక ప్రపంచంలోనే అత్యంత రద్దీగా ఉండే హీత్రూ విమానాశ్రయాన్ని మూసివేశారు. శుక్రవారం అర్ధరాత్రి వరకు ఎయిర్‌పోర్టు పని చేయదని అధికారులు తెలిపారు. ఈ విమానాశ్రయానికి కూడా ఈ సబ్‌స్టేషన్ నుంచే విద్యుత్ సరఫరా అవుతోంది. భారీ అగ్నిప్రమాదం సంభవించడంతో తీవ్ర అంతరాయం ఏర్పడింది.

ప్రయాణికుల అసౌకర్యానికి చింతిస్తున్నట్లు హీత్రో ఎయిర్‌పోర్టు అధికారులు తెలిపారు. విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో పరిస్థితులు అనుకూలించడం లేదని పేర్కొన్నారు.