Boris Johnson: రేసులో ఉంటే మళ్లీ బోరిస్ జాన్సనే ప్రధాని!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Boris Johnson: బ్రిటన్ ప్రధాని పదవికి బోరిస్ జాన్సన్ రాజీనామా చేసిన తర్వాత ఆయన స్థానం కోసం భారత సంతతి వ్యక్తి రిషి సునక్, లిజ్ ట్రస్ పోటీ పడుతున్నారు. గతంలో పీఎం రేసులో అన్ని దశల్లో మొదటి స్థానంలో నిలిచిన రిషి సునక్… ఆ తరువాత జరిగిన డిబెట్లలో లిజ్ ట్రస్ తర్వాత నిలుస్తున్నారు. దీంతో యూకే ప్రధాని అవకాశాలు లిజ్ ట్రస్ కే ఎక్కువగా ఉన్నాయని సర్వేలు ఘోషిస్తున్నాయి. కాకపోతే ఓ సర్వేలో మాజీ ప్రధాని బోరిస్ జాన్సన్ గురించి ప్రస్తావించింది. బ్రిటన్ ప్రధాని రేసులో బోరిస్ జాన్సన్ ఉండి ఉంటే ఆయనకే మళ్లీ పీఠం దక్కి ఉండేదని ‘స్కై న్యూస్’ కోసం నిర్వహించిన యూగస్ సర్వేలో తేలింది. కన్జర్వేటివ్ పార్టీ సభ్యుల్లో ఎక్కువ మంది బోరిస్‌నే కోరుకుంటున్నట్లు ఆ సర్వేలో వెల్లడైంది.
జాన్సన్ కనుక పోటీలో ఉండి ఉంటే 46 శాతం ఓట్లు ఆయనకే వచ్చి ఉండేవని తెలిసింది. అప్పుడు విదేశాంగ మంత్రి లిజ్ ట్రస్‌కు 24 శాతం, సునాక్‌కు 23 శాతం ఓట్లు మాత్రమే వచ్చేవని ఈ సర్వే వెల్లడించింది. అంతే కాకండా బోరిస్ రాజీనామా కోసం ఒత్తిడి తీసుకొచ్చి తప్పు చేశారని 55 శాతం మంది అభిప్రాయపడ్డారు. ప్రధాని పదవికి అభ్యర్థిని తేల్చేందుకు ఓటు వేసే అర్హత ఉన్న 1,089 మంది పార్టీ సభ్యులతో ఈ నెల 12 నుంచి 17 తేదీల మధ్య నిర్వహించిన యూగవ్ సర్వేలో ఈ విషయాలు వెలుగు చూశాయి. ఈ సర్వే వివరాలను గురువారం ప్రకటించారు.
Also Read
- Iran-Israel Tensions: మధ్యప్రాచ్యంలో మళ్లీ ఉద్రిక్తతలు.. ఇరాన్‌పై ఇజ్రాయెల్ ప్రతీకార దాడులు..
- Philippines Earthquake: ఫిలిప్పీన్స్‌లో 7.8 తీవ్రతతో భారీ భూకంపం.. సునామీ హెచ్చరిక జారీ
- Pakistan: చేతులెత్తేసిన పాకిస్థాన్ ప్రభుత్వం.. అవస్థలు పడుతున్న జనం! ఏం జరిగిందంటే..
- Russia: చమురు మార్కెట్‌ను భారత్ శాసిస్తుంది.. రష్యా సంచలన వ్యాఖ్యలు..
Fake Police Station: ఇది నెక్ట్ లెవల్.. పోలీస్ అధికారి ఇంటికి దగ్గర్లోనే ఫేక్ పోలీస్ స్టేషన్.
ఇక, విదేశాంగ మంత్రి లిజ్ ట్రస్, భారత సంతతికి చెందిన రిషి సునాక్ మధ్య జరుగుతున్న పోరులో ట్రస్ 32 పాయింట్ల ఆధిక్యంలో ఉన్నట్టు యూగవ్ తాజా సర్వే తేల్చింది. అంతకుముందు కన్జర్వేటివ్ పార్టీ సొంత సర్వేలోనూ ఇలాంటి ఫలితమే వచ్చింది. వచ్చే ఎన్నికల్లో ప్రతిపక్ష లేబర్ పార్టీ నాయకుడు కైర్ స్టార్మర్ను ఓడించే సత్తా జాన్సన్‌కు మాత్రమే ఉందని అత్యధికమంది కన్జర్వేటివ్ సభ్యులు భావిస్తున్నారు. కాగా, సర్వేలన్నీ ట్రస్‌కే అనుకూలంగా ఉండడం గమనార్హం. కన్జర్వేటివ్ పార్టీ నాయకత్వ రేసులో మాజీ ఛాన్సలర్ రిషి సునక్‌పై విదేశాంగ కార్యదర్శి లిజ్ ట్రస్ 32 పాయింట్ల ఆధిక్యాన్ని ఈ యూగస్ సర్వే ధృవీకరించింది. టోరీ సభ్యుల్లో మాజీ ప్రధాని బోరిస్ జాన్సన్‌కు బలమైన ప్రాధాన్యతను కూడా చూపించింది.
తాజావార్తలు
-
Vivo X Fold 6: ఏఐ ఫీచర్లు, న్యూ యూజర్ ఇంటర్ఫేస్తో.. వివో ఎక్స్ ఫోల్డ్ 6 త్వరలో విడుదల
-
Kangana Ranaut : నర్స్‌లను గ్లామర్ వృత్తిగా మార్చేశారు… డ్రెస్ కోడ్‌పై కంగనా రనౌత్ షాకింగ్ కామెంట్స్
-
Kishan Reddy: బొగ్గు ఉత్పత్తిలో భారత్ కొత్త రికార్డు.. మోదీ సంస్కరణలే ఈ ఫలితం.!
-
Mamata Banerjee: మమతా బెనర్జీకి మరో షాక్.. సుఖేందు శేఖర్ రాయ్ టీఎంసీని వీడి రాజ్యసభ ఎంపీ పదవికి రాజీనామా
-
Peddi 4 days Collections : పెద్ది 4 డేస్ వరల్డ్ వైడ్ కలెక్షన్స్.. జస్ట్ మిస్
ట్రెండింగ్
-
Manav Suthar Record: అరంగేట్ర స్పిన్నర్ మానవ్ సుతార్ అరుదైన రికార్డు.. ఈ శతాబ్దంలోనే ‘ఒకే ఒక్కడు’!
-
Harmanpreet Kaur: ‘నేను రిటైర్ అవ్వాలనుకుంటున్నారా?’.. రిపోర్టర్ కు ధోనీ స్టైల్లో మహిళా కెప్టెన్ కౌంటర్.!
-
Birth Rate: భారత్‌లో పడిపోతున్న జననాల రేటు.. విద్యావంతులు తక్కువ మంది పిల్లలను కనడమే కారణమా.?
-
Sugar Cravings Control : తీపి తినాలనే కోరికా..? ఈ చిట్కాలతో మీ స్వీట్ క్రేవింగ్స్‌కు చెక్ పెట్టండి.!
-
Monsoon Tips: వర్షాకాలంలో ప్రయాణమా..? ఈ చిన్న జాగ్రత్తలు ప్రాణాలను కాపాడతాయి.!