Site icon NTV Telugu

Iran-Israel: ట్రంప్ ప్రకటన ఉత్తిదే.. ఇజ్రాయెల్‌పై తాజాగా ఇరాన్ క్షిపణి దాడులు

Iranmissiles

Iranmissiles

ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య కాల్పుల విరమణ జరిగినట్లుగా ట్రంప్ ప్రకటించారు. కానీ ఆ ప్రకటనను ఇరాన్ తోసిపుచ్చింది. అలాంటి ఒప్పందం ఏమీ జరగలేదని వెల్లడించింది. అన్నట్టుగానే ఇరాన్.. తాజాగా ఇజ్రాయెల్‌పై క్షిపణులు ప్రయోగించింది. దీంతో ఇజ్రాయెల్‌లోని పలు ప్రాంతాల్లో సైరన్లు మోగుతున్నట్లు తెలిపింది.

రాబోయే 24 గంటల్లో ఇరు దేశాల మధ్య కాల్పుల విరమణ అమల్లోకి వస్తుందని ట్రంప్ ప్రకటన తర్వాత తాజాగా ఇరాన్ తన ప్రతీకార దాడులు ప్రారంభించింది. మంగళవారం ఉదయం ఇజ్రాయెల్‌పై క్షిపణులు ప్రయోగించింది. ఇక అమెరికా లక్ష్యంగా పశ్చిమాసియాలో ఉన్న యూఎస్ స్థావరాలపై దాడులు చేయొచ్చని కూడా తెలుస్తోంది.

ఇది కూడా చదవండి: Barqa Madan : గ్లామర్ ప్రపంచం వదిలేసి.. సన్యాసిగా మారిన RGV హీరోయిన్

ఇదిలా ఉంటే సోమవారం రాత్రి ముందు జాగ్రత్తగా ఖతార్ తన గగనతలాన్ని మూసేసింది. కొద్దిసేపటికే ఖతార్‌లోని అల్ ఉదీద్ వైమానిక స్థావరంలో ఉన్న అమెరికన్ దళాలపై ఇరాన్ క్షిపణి ప్రయోగించింది. అయితే ఈ దాడిని ఖతార్ ఖండించింది. ప్రత్యక్షంగా మురియు అంతర్జాతీయ చట్టానికి అనుగుణంగా స్పందించే హక్కు తమకు ఉందని తెలిపింది.

ఇది కూడా చదవండి: AP Cabinet Sub Committee: నేడు ఏపీ కేబినెట్‌ సబ్‌ కమిటీ భేటీ.. 20 లక్షల ఉద్యోగాల కల్పనపై చర్చ!

జూన్ 13న ఇరాన్‌పై ఇజ్రాయెల్ యుద్ధం ప్రారంభించింది. అణు కేంద్రాలే లక్ష్యంగా దాడులు చేసింది. అనంతరం ఇరాన్ కూడా ప్రతీకార దాడులు ప్రారంభించింది. ఇంతలో అమెరికా కూడా జోక్యం పుచ్చుకుని.. ఇరాన్ అణు కేంద్రాలే టార్గెట్‌గా దాడులు చేసింది. దీంతో అమెరికాను ఇరాన్ తీవ్రంగా హెచ్చరించింది. తీవ్ర పరిణామాలుంటాయని వార్నింగ్ ఇచ్చింది. అన్నట్టుగానే ఇరాన్.. పశ్చిమాసియాలో ఉన్న అమెరికా దళాలే లక్ష్యంగా దాడులు చేస్తోంది.

Exit mobile version