Site icon NTV Telugu

Sajid Mir: ముంబయి పేలుళ్ల సూత్రధారి సాజిద్ మీర్‌కు 15 ఏళ్లు జైలు శిక్ష

Sajid Mir Jailed For 15 Years

Sajid Mir Jailed For 15 Years

లష్కరే తోయిబా ఉగ్రవాది సాజిద్ మీర్‌కు పాకిస్థాన్‌లోని లాహోర్ యాంటీ టెర్రరిజం కోర్టు జైలు శిక్ష విధించింది. ముంబయిలో 2008 నవంబరు 26న జరిగిన ఉగ్రదాడి ఘటనలో ప్రధాన నిందితుడైన నిషేధిత ఉగ్రవాదికి సాజిద్ మీర్‌కు 15ఏళ్ల జైలు శిక్ష విధిస్తూ కోర్టు తీర్పు ఇచ్చింది. ఉగ్రవాద సంస్థలకు నిధులు సమకూర్చిన కేసులో న్యాయస్థానం ఈ శిక్ష విధించింది. రూ.4 లక్షల జరిమానా కూడా విధించింది. కేసు విచారణలో భాగంగా ఈ ఏడాది ఏప్రిల్‌లో అరెస్ట్‌ అయినప్పటి నుంచి లాహోర్‌లోని కోట్‌లఖ్‌పత్‌ జైల్లో మీర్‌ ఉన్నాడని అతడి తరఫు న్యాయవాది తెలిపారు. అయితే గతంలో మీర్ చనిపోయినట్లు పాకిస్తాన్‌ ప్రకటించింది. గతంలో ప్రకటించినప్పటికీ పశ్చిమ దేశాలు నమ్మలేదు. మృతి చెందినట్లు ఆధారాలు చూపాలని పట్టుబట్టాయి. భారత్‌ మోస్ట్‌వాంటెడ్‌ ఉగ్రవాదుల జాబితాలోనూ మీర్‌ ఉన్నాడు. 40 ఏళ్ల సాజిద్‌పై అమెరికా గతంలోనే 50 లక్షల డాలర్ల నజరానా ప్రకటించింది. మరోవైపు, సాజిద్‌ను అరెస్ట్‌ చేసినందున తమను గ్రే లిస్టు నుంచి తొలగించాలని పాకిస్థాన్‌ కోరినట్లు స్థానిక మీడియా తెలిపింది.

2005లో నకిలీ పాస్‌పోర్టుతో భారత్‌కు వచ్చి వెళ్లాడు. 2008 నవంబరు 11న పాకిస్థాన్‌ నుంచి సముద్ర మార్గం ద్వారా ముంబయి చేరుకుని పది మంది ఉగ్రవాదులతో కలిసి నగరంలోని 12 ప్రాంతాలపై దాడి చేసి 166 మంది పౌరులను పొట్టన పెట్టుకున్నాడు. ఈ నరమేధంలో ఆరుగురు అమెరికా పౌరులు కూడా మృతిచెందారు. ఈ ఘటనలో ఆరుగురు అమెరికా పౌరులు కూడా మృతి చెందారు. ముంబయి పేలుళ్ల ఘటనలో ప్రధాన సూత్రధారి అయిన హఫీజ్‌ సయీద్‌కు లాహోర్‌ ఉగ్రవాద నిరోధక న్యాయస్థానం 68 ఏళ్ల జైలు శిక్ష విధించింది. ప్రస్తుతం అతడు శిక్ష అనుభవిస్తున్నాడు.. లష్కరేతొయిబా అనుబంధ సంస్థగా పనిచేస్తున్న జేయూడీని విదేశీ ఉగ్రవాద సంస్థగా 2014లోనే అమెరికా గుర్తించింది. సయీద్‌ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటించిన అగ్రరాజ్యం.. అతని ఆచూకీ తెలిపిన వారికి కోటి డాలర్ల బహుమతి ఇస్తామని తెలిపింది.

పాకిస్థాన్‌లోని కరాచీ రేవు నుంచి అరేబియా సముద్రం ద్వారా ముంబయిలోకి 2008 నవంబరు 26న అజ్మల్ కసబ్, మరో తొమ్మిది మంది చొరబడ్డారు. ఒబెరాయ్ హోటల్, తాజ్, ఛత్రపతి శివాజీ టెర్మినల్‌ల వద్ద నాలుగు రోజుల పాటు మారణహోమం సృష్టించారు. హోటల్స్‌లో ఉన్న దేశ విదేశీయులను బందీలుగా చేసుకున్నారు. లోపల దాగి ఉన్న ఉగ్రవాదులను మట్టుబెట్టడానికి భారత దళాలకు మూడు రోజులకు పైగా సమయం పట్టింది. పది మంది ఉగ్రవాదుల్లో 9 మంది చనిపోగా.. ఈ దాడిలో 166 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ దాడితో ముంబై నగరం భయంతో వణికిపోయింది.

Exit mobile version