NTV Telugu Site icon

Israel: “ఇండియా-మిడిల్ ఈస్ట్-యూరప్ కారిడార్”.. ఇజ్రాయిల్ ప్రధాని ప్రశంసలు..

Isreal

Isreal

Israel: చైనా ‘బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్’ ప్రత్యామ్నాయంగా భావిస్తున్న ‘ఇండియా-మిడిల్ ఈస్ట్-యూరప్ కారిడార్(IMEC)’పై ఇజ్రాయిల్ ప్రధాని బెంజిమన్ నెతన్యాహూ ప్రశంసలు కురిపించారు. ఈ ప్రాజెక్టు మన చరిత్రలోనే అతిపెద్ద సహకార ప్రాజెక్టుగా నిలుస్తుందని అన్నారు. దీని వల్ల తూర్పు దేశాలు, ఇజ్రాయిల్, మొత్తం ప్రపంచానికి ప్రయోజనం చేకూరుతుందని ఆయన పేర్కొన్నారు. జీ20 సమావేశాల్లో శనివారం అమెరికా, భారతదేశం, సౌదీ అరేబియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ దేశాధినేతలు సంయుక్తంగా ప్రకటించారు.

ఆసియా నుంచి యూరప్ వరకు మౌళిక సదుపాయాలను విస్తరించిే ఈ అంతర్జాతీయ ప్రాజెక్టుపై ఇజ్రాయిల్ దృ‌ష్టి సారించిందని అన్నారు. ఈ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నట్లు నెతన్యాహూ ఓ వీడియో సందేశంలో తెలిపారు. మిడిల్ ఈస్ట్, ఇజ్రాయిల్ ముఖచిత్రాన్ని ఈ ప్రాజెక్టు మారుస్తుందని అన్నారు. భారతదేశం నుంచి ప్రారంభమయ్యే ఈ ప్రాజెక్టు అరబ్, గల్ఫ్ దేశాలను, యూరోపియన్ దేశాలతో కలుపుతుందని నెతన్యాహూ అన్నారు. ఈ ప్రాజెక్టులో కీలకంగా వ్యవహరించిన యూఎస్ఏకి నెతన్యాహూ ధన్యవాదాలు తెలిపారు.

Read Also: IND vs PAK Live Updates: భారత్-పాక్‌ మ్యాచ్.. ఆగిపోయిన వర్షం, మైదానాన్ని పరిశీలించనున్న అంపైర్లు

చైనా 2013లో చేపట్టిన బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్(బీఆర్ఐ) ప్రాజెక్టుకు ప్రత్యామ్నాయంగా ఈ కొత్త ఆర్తిక కారిడార్ చెప్పబడుతోంది. డ్రాగన్ కంట్రీ చేపట్టిని ఈ ప్రాజెక్టు చిన్న దేశాలను అప్పుల ఊబిలోకి నెట్టేస్తుందని వాదనలు ఉన్నాయి. ప్రపంచ తయారీ దిగ్గజంగా ఉన్న చైనా తన ఉత్పత్తులను అమ్ముకునేందుకు భూ, సముద్రమార్గాల నెట్వర్క్ ద్వారా ఆగ్నేయాసియా, మధ్య ఆసియా, గల్ఫ్ దేశాలు, ఆఫ్రికా, యూరప్ ప్రాంతాలను అనుసంధానించే లక్ష్యంతో జిన్ పింగ్ ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టును ముందుకు తీసుకువచ్చాడు. అయితే ఈ ప్రాజెక్టు అనుకున్నంత సత్ఫలితాలను ఇవ్వడం లేదని ఇటలీ ఇందులోనుంచి బయటకు వెళ్లేందుకు సిద్ధపడుతున్నట్లు వార్తలు వస్తున్నాయి.

ఇజ్రాయిల్ – సౌదీ అరేబియాల మధ్య ఇప్పుడిప్పుడే సన్నిహిత సంబంధాలు మెరుగవుతున్న తరుణంలో ఈ కొత్త ఎకనామిక్ కారిడార్ భారతదేశాన్ని, మిడిల్ ఈస్ట్, యూరప్ తో నేరుగా కలుపుతుంది. ఈ ప్రాజెక్టులో ఓడరేవులు, రైల్వే వ్యవస్థ ఈ దేశాలన్నింటిని అనుసంధానం చేయనున్నాయి. రైల్వేల నిర్మాణం, హైడ్రోజన్ పైపు లైన్లు, విద్యుత్ కేబుల్స్, పైబర్ ఆప్టిక్ కేబుల్స్ మొదలైన మౌళిక సదుపాయాలు ఈ ప్రాజెక్టుకు కీలకం కానున్నాయి.

Show comments