Israel: చైనా ‘బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్’ ప్రత్యామ్నాయంగా భావిస్తున్న ‘ఇండియా-మిడిల్ ఈస్ట్-యూరప్ కారిడార్(IMEC)’పై ఇజ్రాయిల్ ప్రధాని బెంజిమన్ నెతన్యాహూ ప్రశంసలు కురిపించారు. ఈ ప్రాజెక్టు మన చరిత్రలోనే అతిపెద్ద సహకార ప్రాజెక్టుగా నిలుస్తుందని అన్నారు. దీని వల్ల తూర్పు దేశాలు, ఇజ్రాయిల్, మొత్తం ప్రపంచానికి ప్రయోజనం చేకూరుతుందని ఆయన పేర్కొన్నారు. జీ20 సమావేశాల్లో శనివారం అమెరికా, భారతదేశం, సౌదీ అరేబియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ దేశాధినేతలు సంయుక్తంగా ప్రకటించారు.