Site icon NTV Telugu

Power Outage: స్పెయిన్‌, పోర్చుగల్‌లో నిలిచిన విద్యుత్‌ సరఫరా.. స్తంభించిన జనజీవనం!

Power Cuts

Power Cuts

Power Outage: యూరప్‌ దేశాలైన స్పెయిన్, పోర్చుగల్‌తో పాటు ఫ్రాన్స్‌లోని వివిధ ప్రాంతాల్లో విద్యుత్‌ సరఫరాలో తీవ్ర అంతరాయం కొనసాగుతుంది. దీంతో లక్షలాది మంది ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నట్లు అంతర్జాతీయ మీడియా కథనాలు ప్రసారం చేస్తుంది. అయితే, యూరోపియన్‌ విద్యుత్‌ గ్రిడ్‌లో సమస్య ఏర్పడటమే దీనికి ప్రధాన కారణంగా తెలుస్తుంది. ఈ అంశంపై రెడ్‌ ఎలక్ట్రికా సంస్థ రియాక్ట్ అయింది. విద్యుత్‌ సరఫరాను త్వరలోనే పునరుద్ధరించడానికి కృషి చేస్తున్నట్లు తెలిపారు. ఈ సమస్యకు కారణమేంటనే అంశాన్ని విశ్లేషిస్తున్నట్లు ఎక్స్‌ (ట్విట్టర్) వేదికగా రాసుకొచ్చారు.

Read Also: Allu Aravind : మహిళలను బొద్దింకలతో అందుకే పోల్చాం.. అరవింద్ క్లారిటీ

అయితే, ఆయా దేశాల కాలమానం ప్రకారం సోమవారం మధ్యాహ్నం 12:30 గంటలకు దేశంలోని జాతీయ విద్యుత్ గ్రిడ్‌ ఆగిపోయినట్లు స్పెయిన్ జాతీయ రైల్వే కంపెనీ రెన్‌ఫే ప్రకటించింది. దీంతో రైళ్లు ఎక్కడికక్కడ నిలిచిపోయినట్లు తెలిపింది. పవర్ నిలిచిపోవడంతో వార్షిక మ్యాడ్రిడ్‌ ఓపెన్‌ టెన్నిస్‌ టోర్నమెంట్‌ ఆగిపోయినట్లు తెలుస్తుంది. అలాగే, విమానాశ్రయాలు, టెలీ కమ్యూనికేషన్లపైనా తీవ్ర ప్రభావం పడటంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నట్లు అంతర్జాతీయ మీడియాలో కథనాలు వస్తున్నాయి.

Exit mobile version