Site icon NTV Telugu

Texas: అంతుచిక్కని మిస్టరీ.. ట్రక్కులో 46 మృతదేహాలు

Texas Truck

Texas Truck

అమెరికాలో విషాదకర ఘటన వెలుగుచూసింది. టెక్సాస్‌ రాష్ట్రంలోని శాన్ ఆంటోనియోలో ఓ రోడ్డుపై ఉన్న ట్రక్కులో 46 మృతదేహాలు బయటపడ్డాయి. మరో 16 మంది ప్రాణాలతోనే ఉండగా వారిని ఆస్పత్రికి తరలించినట్లు అధికారులు తెలిపారు. ట్రక్కులో ఉన్న వారు మెక్సికో నుంచి అక్రమంగా అమెరికా సరిహద్దులు దాటినట్లు అధికారులు భావిస్తున్నారు. అయితే ఉష్ణోగ్రతలు తీవ్రంగా ఉండటంతోనే ట్రక్కులోని వారు మరణించి ఉంటారని అనుమానిస్తున్నారు. శాన్ ఆంటోనియో నగరం దక్షిణ శివార్లలోని మారుమూల ప్రాంతంలో రైలు పట్టాల పక్కన ఈ ట్రక్కు కనిపించిందని అక్కడి మీడియా కథనాలు ప్రచురించింది.ఈ నేపథ్యంలో అధికారులు ట్రక్కును తనిఖీ చేయగా అందులో మృతదేహాలు ఉన్న విషయం బయటపడిందని తెలుస్తోంది.

తాజా ఘటనతో పోలీసులు హై అలర్ట్ ప్రకటించారు. ట్రక్కులో ఉన్నవాళ్లు ఏ విధంగా మరణించారన్న అంశంపై దర్యాప్తు చేపట్టారు. ఇటీవల శాన్ ఆంటోనియో నగరంలో ఉష్ణోగ్రతలు అధిక తేమ కారణంగా 103 డిగ్రీల ఫారెన్‌హీట్ వరకు పెరిగాయి. కానీ ఈ ఉష్ణోగ్రతలకు అంతమంది ఒకేసారి చనిపోయే ఆస్కారమే లేదని పలువురు భావిస్తున్నారు. అమెరికాలోని దక్షిణ టెక్సాస్‌కు చెందిన వీరంతా వలస వెళ్లేందుకు ప్రయత్నించగా హత్య చేసి ఉంటారని అనుమానిస్తున్నారు. ట్రక్కులో మృతదేహాలు బయటపడిన ఘటనపై ప్రభుత్వం కూడా విచారణకు ఆదేశించింది. మొత్తానికి ట్రక్కులో 46 మృతదేహాలు ఉండటం అధికారులకు అంతుచిక్కని మిస్టరీగా మారింది.

South Africa: నైట్ క్లబ్‌లో దారుణం.. 20 మంది యువకులు దుర్మరణం

Exit mobile version