IT layoffs: 4 నెలల్లో 3 కంపెనీలు ఉద్యోగం నుంచి తొలగించాయి.. ఓ టెక్కీ ఆవేదన
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Laid off 3 times in 4 months: చాలా మందికి ఐటీ, సాఫ్ట్వేర్ ఉద్యోగం ఓ కల. సాఫ్ట్వేర్ ఉద్యోగం ఉందంటే లక్షల్లో జీతాలు, కార్ల, బంగ్లాలు అనే ఉద్దేశం సామాన్య ప్రజల్లో నాటుకుపోయింది. అయితే ఆ మత్తు దిగిపోతోంది ఇప్పుడు. నిర్ధయగా కంపెనీలు తమ ఉద్యోగులను తీసేస్తున్నాయి. ఆర్థికమాంద్యం భయాల నేపథ్యంలో టాప్ టెక్ కంపెనీలు ఉద్యోగులకు ఉద్వాసన పలుకుతున్నాయి. టెక్ దిగ్గజ కంపెనీలు గూగుల్, మైక్రోసాఫ్ట్, మెటా, ట్విట్టర్ ఇలా పలు కంపెనీలు తమ ఉద్యోగులను తొలగించేశాయి. కొత్త పాత అనే సంబంధం లేకుండా ఏడాపెడా ఉద్యోగులను ఊడబీకింది. 2022లో ఉద్యోగుల లేఆఫ్ లు ప్రారంభం కాగా.. 2023లో కొనసాగుతున్నాయి. దాదాపుగా 90 ఇతర టెక్ కంపెనీలు ప్రపంచవ్యాప్తంగా 50,000 మందికి పైగా ఉద్యోగులను తొలగించాయి.
Read Also: Twitter: యాడ్స్ ఫ్రీగా ట్విట్టర్.. కానీ కండిషన్స్ అఫ్లై.. ఎలాన్ మస్క్ మరో బిగ్ మూవ్..
Also Read
- H-1B Visa: భారతీయులకు గట్టి షాక్.. H-1B వీసా నిబంధనలపై తగ్గేదేలే అంటున్న అమెరికా..
- US Tariff: అమెరికా నుంచి భారత్‌కు భారీ ఊరట.. వాటిపై 0% టారిఫ్..!
- India-Pakistan: పాక్ గడ్డపై భారత అధికారులు.. ఇస్లామాబాద్‌లో మొదలైన హై-వోల్టేజ్ మీటింగ్! అసలు ఏం జరుగుతోంది?
- Nepal Floods: నేపాల్‌లో జల ప్రళయం.. విరిగిపడ్డ కొండచరియలు.. మూడు రోజుల్లో ఎంత మంది చనిపోయారంటే!
ఇదిలా ఉండగా.. ఓ టెక్కీ ఆవేదన ఇప్పుడు వైరల్ గా మారింది. 4 నెలల్లో 3 సంస్థలు సదరు ఉద్యోగిని ఉద్యోగం నుంచి తొలగించింది. ఉద్యోగం నుంచి తొలగించిన తర్వాత కొత్త కంపెనీలో చేరినా.. ఉద్యోగానికి భద్రత లేదు. మళ్లీ ఉద్యోగాన్ని కోల్పోయే అవకాశం ఉంది. తాజాగా ఓ ఉద్యోగి గూగుల్ నుంచి తొలగించబడ్డాడు. అంతకుముందు నవంబర్ లో అమెజాన్ నుంచి, సెప్టెంబర్ లో స్నాప్ నుంచి తొలగించబడ్డాడు. ‘‘నాకు ఇప్పుడు ఏం చేయాలో తెలియదు.. కొత్తగా ఉపాధిని కనుక్కోవాల్సి ఉంది. ఏదైనా టెక్ కంపెనీ నియామకాలు చేస్తుందా..? నేను కొన్ని నెలలు సెలవు తీసుకుని వేసవిలో మళ్లీ ప్రయత్నించాలా..? స్టార్ట్ ఆప్ ప్రారంభించాలా..?’’ అంటూ బ్లైండ్ లో రాసుకొచ్చాడు.

గూగుల్ ఇటీవల 12,000 మందిని, అమెజాన్ 18,000 మందిని, మైక్రోసాఫ్ట్ 10,000 మందిని, మెటా 11,000 మందిని ఉద్యోగాల నుంచి తొలగించింది. ట్విట్టర్ 50 శాతం ఉద్యోగులకు ఉద్వాసన పలికింది. దీంతో పాటు పలు స్టార్టప్స్, ఇతర కంపెనీలు కూడా ఖర్చులను తగ్గించుకునే ఉద్దేశంతో తమ సిబ్బందిని తొలగిస్తున్నాయి. ఇండియాలో విప్రో కంపెనీ కూడా 400 మంది ప్రెషర్లను ఉద్యోగాల నుంచి తొలగించింది. రాబోయే రోజుల్లో పలు ఇతర భారత ఐటీ కంపెనీలు కూడా లేఆఫ్స్ ప్రకటిస్తాయనే వార్తలు ఐటీ ఉద్యోగుల గుండెల్లో గుబులు పుట్టిస్తోంది.
తాజావార్తలు
-
Guntur Car Fire: కారులో ఏసీ పేలి మంటలు.. తండ్రి సజీవదహనం, కొడుకుకు తీవ్ర గాయాలు..
-
Ai+ నుంచి మూడు కొత్త డివైజ్‌లు.. కొత్త స్మార్ట్ ఫోన్ తోపాటు, 5G ట్యాబ్లెట్ సెగ్మెంట్ లాంచ్.!
-
Ramayana Part 1 Title: రణ్‌బీర్ కపూర్ బర్త్‌డే సర్ప్రైజ్.. ‘రామాయణ’ పార్ట్ 1 టైటిల్ ఇదే!
-
Share Nani: ఒక్క సినిమాకే సరిపోయింది.. మళ్లీ ‘నేచురల్ స్టార్’గానే నాని!
-
Gold Silver Price Today: పడిపోతున్న పసిడి ధర.. వరుసగా రెండో రోజూ భారీగా డౌన్
ట్రెండింగ్
-
12.1 అంగుళాల 3K డిస్ప్లే, 10,100mAh బ్యాటరీతో HONOR MagicPad 4 ట్యాబ్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
October 2026 Rule Changes: అక్టోబర్‌లో మారనున్న కీలక రూల్స్.. బ్యాంక్, LPG, UPI నుంచి ITR వరకు పూర్తి లిస్ట్ ఇదే!
-
Veg Keema: నాన్‌వెజ్ కీమాను మర్చిపోయేలా.. నోరూరించే ధాబా స్టైల్ ‘వెజ్ కీమా’.. సులువుగా చేసేయండి ఇంట్లో.!
-
Bats Theft: నా బ్యాట్లు దొబ్బేశారు.. టీమిండియా ప్లేయర్ ఆవేదన.!
-
100W ఛార్జింగ్, 200MP ARRI కెమెరా, 8,800mAh బ్యాటరీతో ప్రీమియం ఫోన్ HONOR Magic9 Pro Max లాంచ్.!