ఒమిక్రాన్ ఎఫెక్ట్: దేశం విడిచి వెళ్లొద్దు అంటూ వార్నింగ్..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రంపంచదేశాలను వణికిస్తోంది కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్.. ఇప్పుడిప్పుడే కరోనా నుంచి బయటపడుతున్న తరుణంలో.. మరోసారి ఒమిక్రాన్ విజృంభిస్తుండడంతో అంతా ఆందోళనకు గురవుతున్నారు.. ఇప్పటికే 14 దేశాలను చుట్టేసింది కొత్త వేరియంట్.. దీంతో అన్ని దేశాలు నివారణ చర్యలకు పూనుకుంటున్నాయి.. అంతర్జాతీయ ప్రయాణలపై ఆంక్షలు విధిస్తున్నాయి.. వ్యాక్సిన్ వేసుకున్నా, టెస్ట్ చేయించుకుని నెగిటివ్ రిపోర్ట్‌తో వచ్చినా.. మళ్లీ కోవిడ్ నిర్ధారణ పరీక్షలు చేస్తున్నారు.. ఈ నేపథ్యంలో.. దేశ పౌరులు, వలసదారులకు కువైట్ సర్కార్ కీల ఆదేశాలు జారీ చేసింది.
Read Also: రైతుల సంక్షేమంలో దేశానికే కేసీఆర్ మార్గదర్శి..
Also Read
- Iran-Trump: హార్ముజ్‌పై ట్రంప్ ముందు ఇరాన్ కీలక ప్రాతిపాదన.. స్పందన ఎలా ఉంటుందో..!
- AI fraud: 65 ఏళ్ల మహిళ.. 29 ఏళ్ల డాక్టర్‌గా AI మోసం! వ్యాపారవేత్తకు భారీ టోకరా
- US-Iran Conflict: ఇరాన్ ఎయిర్‌లైన్స్‌కు అమెరికా బిగ్ షాక్.. సెప్టెంబర్ 23 నుంచి పూర్తిగా బంద్?
- US-Iran: ఇరాన్ ఎయిర్‌లైన్స్‌కు అమెరికా భారీ షాక్.. ఎల్లుండి నుంచి ప్రపంచవ్యాప్తంగా నిలిచిపోనున్న సర్వీసులు!
ఒమిక్రాన్ వేరియంట్ టెన్షన్ పెడుతోన్న ఈ సమయంలో.. దేశం పౌరులు కానీ, ప్రవాసులు కానీ బయటకు వెళ్లొద్దని హెచ్చరించింది కువైట్ ప్రభుత్వం.. నయా వేరియంట్ కలవరపెడుతున్న సమయంలో విదేశాలకు వెళ్లడం మంచిది కాదని అంతర్గత, ఆరోగ్యశాఖ అధికారులు పేర్కొన్నారు. అయితే, మరికొన్ని రోజుల తర్వాత ఒమిక్రాన్ వేరియంట్‌పై ఓ అవగాహన వస్తుందని.. అప్పటి వరకు మాత్రం దేశం నుంచి బయటకు వెళ్లకపోవడమే శ్రేయస్కారం అని సూచిస్తున్నారు అధికారులు. మరోవైపు గత నెలలో జరిగిన కేబినెట్ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలకు అనుగుణంగా.. కరోనా నిబంధనలను ప్రతీ ఒక్కరూ పాటించాలని.. తప్పనిసరి పరిస్థితిలో మాత్రమే ప్రత్యేక అనుమతులు తీసుకుని దేశం వీడితే బాగుంటుందని స్పష్టం చేసింది కువైట్ ప్రభుత్వం.
తాజావార్తలు
-
Rain Alet: తెలంగాణపై వాయుగుండం ప్రభావం.. రెడ్ అలర్ట్ జారీ చేసిన అధికారులు..
-
Randeep Hooda: ‘‘అహింసతో మాత్రమే స్వాతంత్య్రం రాలేదు’’.. సావర్కర్‌పై బాలీవుడ్ స్టార్ కీలక వ్యాఖ్యలు..
-
Kayadu Lohar: రూమర్స్‌కి, నా రోల్‌కి నక్కకి నాగలోకానికి ఉన్నంత తేడా.. ‘ది ప్యారడైజ్’ పాత్రపై కయాదు షాకింగ్ కామెంట్స్!
-
Chiranjeevi : 60 ప్లస్ లోనూ ఆ ఎనర్జీ ఎలా? తన యవ్వన ‘సీక్రెట్’ బయటపెట్టిన చిరంజీవి!
-
UP: ప్రాణాలు తీసిన డీజే సౌండ్.. తరగతి గదిలో బాలిక మృతి
ట్రెండింగ్
-
మిలిటరీ గ్రేడ్ బాడీ, 120Hz డిస్ప్లే, 7,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో OnePlus N6 Lite.. ధర ఎంతంటే?
-
Team India History: భారత్ @ 200.. టీ20ల్లో తొలి జట్టుగా భారత్ వరల్డ్ రికార్డ్!
-
1.5K 144Hz OLED డిస్ప్లే, 7200mAh బ్యాటరీతో అక్టోబర్ 6న రాబోతున్న VIVO V80..!
-
India Win Gold Medal: ఆసియా క్రీడలు 2026 మహిళా క్రికెట్ విజేతగా టీమిండియా..! స్వర్ణ పతకం కైవసం..
-
Asian Games 2026 Final: శ్రీలంక బౌలర్లపై స్మృతి మంధాన శివతాండవం.. లంక ముందు భారీ టార్గెట్.!