Germany: రైల్వే స్టేషన్లో కత్తితో మహిళ వీరంగం.. 12 మందికి తీవ్రగాయాలు
- జర్మనీ రైల్వే స్టేషన్లో కత్తితో మహిళ వీరంగం
- 18 మందికి గాయాలు.. నలుగురికి సీరియస్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
జర్మనీలోని హాంబర్గ్ ప్రధాన రైల్వే స్టేషన్లో ఓ మహిళ కత్తితో వీరంగం సృష్టించింది. విచక్షణారహితంగా కత్తితో తెగ నరికింది. ఈ ఘటనలో 18 మంది ప్రయాణికులు గాయపడ్డారు. ఇందులో నలుగురి పరిస్థితి విషమంగా ఉంది. అప్రమత్తమైన పోలీసులు.. 39 ఏళ్ల మహిళను అరెస్ట్ చేశారు. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. తీవ్రమైన కత్తిపోట్ల కారణంగా కొంత మంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు వెల్లడించారు. అయితే దాడికి గల కారణాలను పోలీసులు వెల్లడించలేదు. అయితే మానసిక సమస్యతో ఈ దాడికి పాల్పడి ఉండొచ్చని అనుమానిస్తున్నారు.
ఇది కూడా చదవండి: Donald Trump: టెక్ కంపెనీలపై ట్రంప్ దాడి.. ఐఫోన్లను అమెరికాలో తయారు చేయాల్సిందే.. లేకపోతే 25 శాతం సుంకం
Also Read
- Plague: ల్యాబ్ నుంచి మృత్యువు..! ఆ మహిళా ఎలా చనిపోయింది?
- Flydubai Attack: ‘‘ఇంకా ముగియలేదు’’.. అమెరికా, ఇజ్రాయిల్ విమానాలపై అల్‌ఖైదా టార్గెట్.!
- US-Iran: ‘‘మా దేశం నుంచి వెళ్లిపోండి’’.. ఇరాన్ దౌత్యవేత్తలకు అమెరికా షాక్.!
- Smit Machchhar: ‘‘ఇజ్రాయెల్, భారత్.. ప్రపంచానికే హీరో’’.. స్మిత్ మచ్చర్‌కు నెతన్యాహు భారీ గౌరవం
మహిళ ఒక్కతే ఈ ఘాతుకానికి పాల్పడినట్లు పోలీసులు వెల్లడించారు. శుక్రవారం సాయంత్రం 6:30 గంటల ప్రాంతంలో ఈ సంఘటన జరిగిందని పోలీసులు పేర్కొన్నారు. ఆమె ఈ ఘాతుకానికి ఎందుకు పాల్పడిందో వివరాలు వెల్లడించలేదు. అయితే బాధితుల్లో కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు చెప్పారు. ప్రస్తుతం ఈ ఘటనపై దర్యాప్తు జరుగుతోందని.. త్వరలోనే వివరాలు వెల్లడిస్తామని చెప్పుకొచ్చారు. ఇక బాధితులందరికీ తీవ్రమైన గాయాలు అయినట్లుగా జర్మనీ మీడియా తెలిపింది. రద్దీ సమయంలో మహిళ ఈ ఘాతుకానికి తెగబడిందని పేర్కొంది.
ఇది కూడా చదవండి: COVID 19: కోవిడ్ బారిన పడ్డ మరో సినీ నటి..
ఇక ఘటన తర్వాత అధికారులు స్టేషన్‌లోని 4 ప్లాట్‌ఫామ్‌లను మూసేశారు. ఇటీవల జర్మనీలో వరుస హింసాత్మక దాడులు చోటుచేసుకుంటున్నాయి. రోజురోజుకు తీవ్రవాదం పెరిగిపోతోంది. దీంతో ప్రభుత్వం భద్రతను కట్టుదిట్టం చేసింది. ఆదివారం బీలేఫెల్డ్ నగరంలోని ఒక బార్లో జరిగిన కత్తిపోటులో నలుగురు వ్యక్తులు గాయపడ్డారు. ఈ ఘటన వెనుక జిహాదీ విశ్వాసాలు ఉన్నట్లుగా గుర్తించారు.
తాజావార్తలు
-
Telangana MLC : తెలంగాణ ఎమ్మెల్సీ రేసులో బిగ్ ట్విస్ట్.. ఆ మూడు సీట్లు ఎవరికి?
-
Luxury Sneakers: జెన్ జీ, మిలీనియల్స్‌ను తెగ ఆకర్షిస్తున్న స్నీకర్స్.. అంత స్పెషల్ ఏంటో తెలుసా..?
-
KL Rahul: సెంచరీ చేసినా ఉపయోగం లేదు.. అలా జరిగినందుకు బాధగా ఉంది..
-
Srinidhi Shetty: “కెజియఫ్ వచ్చినా ఇంట్లో తిట్లు తప్పట్లేదు..” శ్రీనిధి శెట్టి షాకింగ్ కామెంట్స్
-
Sardar 2 OTT: ఓటీటీలో ‘సర్దార్ 2’ ఊచకోత.. ప్రైమ్ వీడియోలో నంబర్ 1 ట్రెండింగ్!
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!