Site icon NTV Telugu

Germany: రైల్వే స్టేషన్‌లో కత్తితో మహిళ వీరంగం.. 12 మందికి తీవ్రగాయాలు

Germanyhamburgtrainstation

Germanyhamburgtrainstation

జర్మనీలోని హాంబర్గ్ ప్రధాన రైల్వే స్టేషన్‌లో ఓ మహిళ కత్తితో వీరంగం సృష్టించింది. విచక్షణారహితంగా కత్తితో తెగ నరికింది. ఈ ఘటనలో 18 మంది ప్రయాణికులు గాయపడ్డారు. ఇందులో నలుగురి పరిస్థితి విషమంగా ఉంది. అప్రమత్తమైన పోలీసులు.. 39 ఏళ్ల మహిళను అరెస్ట్ చేశారు. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. తీవ్రమైన కత్తిపోట్ల కారణంగా కొంత మంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు వెల్లడించారు. అయితే దాడికి గల కారణాలను పోలీసులు వెల్లడించలేదు. అయితే మానసిక సమస్యతో ఈ దాడికి పాల్పడి ఉండొచ్చని అనుమానిస్తున్నారు.

ఇది కూడా చదవండి: Donald Trump: టెక్ కంపెనీలపై ట్రంప్ దాడి.. ఐఫోన్లను అమెరికాలో తయారు చేయాల్సిందే.. లేకపోతే 25 శాతం సుంకం

మహిళ ఒక్కతే ఈ ఘాతుకానికి పాల్పడినట్లు పోలీసులు వెల్లడించారు. శుక్రవారం సాయంత్రం 6:30 గంటల ప్రాంతంలో ఈ సంఘటన జరిగిందని పోలీసులు పేర్కొన్నారు. ఆమె ఈ ఘాతుకానికి ఎందుకు పాల్పడిందో వివరాలు వెల్లడించలేదు. అయితే బాధితుల్లో కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు చెప్పారు. ప్రస్తుతం ఈ ఘటనపై దర్యాప్తు జరుగుతోందని.. త్వరలోనే వివరాలు వెల్లడిస్తామని చెప్పుకొచ్చారు. ఇక బాధితులందరికీ తీవ్రమైన గాయాలు అయినట్లుగా జర్మనీ మీడియా తెలిపింది. రద్దీ సమయంలో మహిళ ఈ ఘాతుకానికి తెగబడిందని పేర్కొంది.

ఇది కూడా చదవండి: COVID 19: కోవిడ్ బారిన పడ్డ మరో సినీ నటి..

ఇక ఘటన తర్వాత అధికారులు స్టేషన్‌లోని 4 ప్లాట్‌ఫామ్‌లను మూసేశారు. ఇటీవల జర్మనీలో వరుస హింసాత్మక దాడులు చోటుచేసుకుంటున్నాయి. రోజురోజుకు తీవ్రవాదం పెరిగిపోతోంది. దీంతో ప్రభుత్వం భద్రతను కట్టుదిట్టం చేసింది. ఆదివారం బీలేఫెల్డ్ నగరంలోని ఒక బార్‌లో జరిగిన కత్తిపోటులో నలుగురు వ్యక్తులు గాయపడ్డారు. ఈ ఘటన వెనుక జిహాదీ విశ్వాసాలు ఉన్నట్లుగా గుర్తించారు.

Exit mobile version