King Charles-3: 14 వ శతాబ్ధపు సింహాసనం.. 360 ఏళ్ల నాటి కిరీటం.. నేడు కింగ్ చార్లెస్ 3 పట్టాభిషేకం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
King Charles Grand Coronation Ceremony: బ్రిటన్ రాజు కింగ్ చార్లెస్-3 పట్టాభిషేకానికి రంగం సిద్ధం అయింది. శనివారం లండన్ లోని వెస్ట్ మినిస్టర్ అబేలో 2 వేల మందికి పైగా అతిథులు, రాజకుటుంబీకులు, విదేశీ ప్రముఖలు ఈ కార్యక్రమానికి హాజరుకానున్నారు. ఇప్పటికే బ్రిటన్ ప్రభుత్వం ఈ పట్టాభిషేకానికి భారీగా ఏర్పాట్లు చేసింది. వివిధ దేశాల ప్రముఖులు లండన్ చేరుకున్నారు. భారతదేశం తరుపున ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్‌ఖడ్, ఆయన సతీమణి సుదేశ్ ధన్‌ఖడ్ శుక్రవారం లండన్ చేరుకున్నారు. వీరికి అక్కడి ప్రభుత్వం ఘన స్వాగతం పలికింది. సుమారుగా 100 దేశాల ప్రభుత్వ ప్రతినిధులు ఈ కార్యక్రమానికి హాజరుకానున్నట్లు సమాచారం.
Read Also: Bilawal Bhutto: ఆర్టికల్ 370.. దావూద్ ఇబ్రహీం.. భారత్‌తో సంబంధాలపై పాక్ మంత్రి..
Also Read
- Princess Isabella: చరిత్ర సృష్టించిన డెన్మార్క్ యువరాణి ఇసబెల్లా.. తొలిసారి సైన్యంలో చేరిన రాజకుటుంబ మహిళ!
- Trump Marine One: ట్రంప్‌కు గగనతలంలో ప్రమాదం?.. ప్రయాణిస్తున్న ‘మెరైన్ వన్’కు దగ్గరగా వచ్చిన ప్యాసింజర్ విమానం
- Donald Trump: ట్రంప్ సంచలన ప్రకటన.. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత జరగబోయే అతిపెద్ద దాడికి మేము సిద్ధంగా ఉన్నాం
- Shakib Al Hasan: బంగ్లాదేశ్ మాజీ కెప్టెన్ షకీబ్ అల్ హసన్ ఇంటిపై.. పెట్రోల్ బాంబు దాడి!
బ్రిటన్ రాణి క్విన్ ఎలిజబెత్-2 మరణం తర్వాత ఆమె కుమారుడు కింగ్ ఛార్లెస్-3 రాజుగా సింహసనాన్ని అధిష్టించనున్నారు. 14 వ శతాబ్ధపు సింహాసనంలో కూర్చోని, 360 ఏళ్ల పురాతనమైన సెయింట్ ఎడ్వర్డ్స్ కిరీటాన్ని ధరించి రాజుగా పట్టాభిషిక్తుడు కానున్నారు. కింగ్ ఛార్లెస్ తో పాటు ఆయన భార్య క్వీన్ కెమిల్లా కూడా సంప్రదాయబద్ధంగా కిరీటాన్ని ధరిస్తారు. హిందూ సంప్రదాయాన్ని పాటించి యూకే ప్రధాని రిషి సునాక్ ఈ కార్యక్రమంలో బైబిల్ లోని వ్యాక్యాలు పఠించనున్నారు.
ఈ సారి రాజు హోదాను సూచిస్తూ హౌస్ ఆఫ్ లార్డ్స్ సభ్యులు బహూకరించే చిహ్నాల్లో తొలిసారిగా హిందూ, జైన, సిక్కు తదితర మతాలకు చెందినవి కూడా ఉండబోతున్నాయి. హిందువులు, యూదులు, సిక్కులు, ముస్లింలు, బౌద్ధులు తదితర మత ప్రతినిధుల నుంచి ఛార్లెస్ అభినందనలు స్వీకరిస్తారు. ఈ కార్యక్రమానికి ప్రిన్స్ హ్యరీ, ఆండ్రూ హాజరుకానునన్నారు. అయితే వీరు రాజకుటుంబీకులకు ఇచ్చే అధికారిక మర్యాదలు వీరికి ఉండవు. వేడుకల తర్వాత అబే నుంచి బకింగ్‌హామ్ ప్యాలెస్‌కు కొత్తగా పట్టాభిషిక్తుడైన రాజును తీసుకువెళ్ళే గోల్డ్ స్టేట్ కోచ్ వెనుక బహిరంగ ఊరేగింపులో కూడా వీరు హాజరుకారు.
తాజావార్తలు
-
YCP vs TDP: బెజవాడలో ఉద్రిక్తత.. వైసీపీ దీక్షా శిబిరం టెంట్ తొలగించిన టీడీపీ శ్రేణులు!
-
Preity Zinta: ‘సగం ఇండియన్, సగం అమెరికన్… పిల్లలకు ఇండియన్ రూట్స్… ఎనిమిదేళ్ల రీఎంట్రీపై ప్రీతి ఆసక్తికర వ్యాఖ్యలు!
-
Tarun Tejpal: భారత మీడియాను ఊపేసిన కేసులో క్లైమాక్స్.. ‘తెహల్కా’ వ్యవస్థాపకుడికి హైకోర్టులో బిగ్ షాక్..
-
Mega Multistarrer : ఒకే స్క్రీన్‌పై వరుణ్ తేజ్ – నాగబాబు.. భారీ బడ్జెట్ పై నిర్మిస్తున్న నిహారిక
-
Singareni Naini Coal Mine: సింగరేణి చరిత్రలో చారిత్రాత్మక ఘట్టం.. నైనీ గని నుంచి తెలంగాణకు చేరిన తొలి బొగ్గు రైలు
ట్రెండింగ్
-
Incredible Story: దేశవాళీ క్రికెట్లో 9 వేల రన్స్.. టీమిండియా డెబ్యూలోనే హాఫ్ సెంచరీ.. కానీ అడ్రస్ లేకుండా పోయిన ఓపెనర్!
-
Bear Kills Siblings: ఎలుగుబంటి బీభత్సం.. అన్నాచెల్లెళ్లపై దాడి, ఇద్దరి మృతి..!
-
Jio మాస్టర్ ప్లాన్.. రూ.319కే 18 నెలల Google AI Pro, 45GB హై-స్పీడ్ డేటా, అన్లిమిటెడ్ కాల్స్..!
-
8,000 నిట్స్ OLED డిస్ప్లే, 8,500mAh భారీ బ్యాటరీ, Kirin 8020 చిప్‌తో Huawei Nova 16 SE లాంచ్..!
-
Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీ.. ఎగిరెగిరిపడొద్దు.. ఆ ఇద్దరి కెరీర్ ఏమైందో తెలుసుకో!