NTV Telugu Site icon

King Charles-3: 14 వ శతాబ్ధపు సింహాసనం.. 360 ఏళ్ల నాటి కిరీటం.. నేడు కింగ్ చార్లెస్ 3 పట్టాభిషేకం..

King Charles Grand Coronation Ceremony

King Charles Grand Coronation Ceremony

King Charles Grand Coronation Ceremony: బ్రిటన్ రాజు కింగ్ చార్లెస్-3 పట్టాభిషేకానికి రంగం సిద్ధం అయింది. శనివారం లండన్ లోని వెస్ట్ మినిస్టర్ అబేలో 2 వేల మందికి పైగా అతిథులు, రాజకుటుంబీకులు, విదేశీ ప్రముఖలు ఈ కార్యక్రమానికి హాజరుకానున్నారు. ఇప్పటికే బ్రిటన్ ప్రభుత్వం ఈ పట్టాభిషేకానికి భారీగా ఏర్పాట్లు చేసింది. వివిధ దేశాల ప్రముఖులు లండన్ చేరుకున్నారు. భారతదేశం తరుపున ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్‌ఖడ్, ఆయన సతీమణి సుదేశ్ ధన్‌ఖడ్ శుక్రవారం లండన్ చేరుకున్నారు. వీరికి అక్కడి ప్రభుత్వం ఘన స్వాగతం పలికింది. సుమారుగా 100 దేశాల ప్రభుత్వ ప్రతినిధులు ఈ కార్యక్రమానికి హాజరుకానున్నట్లు సమాచారం.

Read Also: Bilawal Bhutto: ఆర్టికల్ 370.. దావూద్ ఇబ్రహీం.. భారత్‌తో సంబంధాలపై పాక్ మంత్రి..

బ్రిటన్ రాణి క్విన్ ఎలిజబెత్-2 మరణం తర్వాత ఆమె కుమారుడు కింగ్ ఛార్లెస్-3 రాజుగా సింహసనాన్ని అధిష్టించనున్నారు. 14 వ శతాబ్ధపు సింహాసనంలో కూర్చోని, 360 ఏళ్ల పురాతనమైన సెయింట్ ఎడ్వర్డ్స్ కిరీటాన్ని ధరించి రాజుగా పట్టాభిషిక్తుడు కానున్నారు. కింగ్ ఛార్లెస్ తో పాటు ఆయన భార్య క్వీన్ కెమిల్లా కూడా సంప్రదాయబద్ధంగా కిరీటాన్ని ధరిస్తారు. హిందూ సంప్రదాయాన్ని పాటించి యూకే ప్రధాని రిషి సునాక్ ఈ కార్యక్రమంలో బైబిల్ లోని వ్యాక్యాలు పఠించనున్నారు.

ఈ సారి రాజు హోదాను సూచిస్తూ హౌస్ ఆఫ్ లార్డ్స్ సభ్యులు బహూకరించే చిహ్నాల్లో తొలిసారిగా హిందూ, జైన, సిక్కు తదితర మతాలకు చెందినవి కూడా ఉండబోతున్నాయి. హిందువులు, యూదులు, సిక్కులు, ముస్లింలు, బౌద్ధులు తదితర మత ప్రతినిధుల నుంచి ఛార్లెస్ అభినందనలు స్వీకరిస్తారు. ఈ కార్యక్రమానికి ప్రిన్స్ హ్యరీ, ఆండ్రూ హాజరుకానునన్నారు. అయితే వీరు రాజకుటుంబీకులకు ఇచ్చే అధికారిక మర్యాదలు వీరికి ఉండవు. వేడుకల తర్వాత అబే నుంచి బకింగ్‌హామ్ ప్యాలెస్‌కు కొత్తగా పట్టాభిషిక్తుడైన రాజును తీసుకువెళ్ళే గోల్డ్ స్టేట్ కోచ్ వెనుక బహిరంగ ఊరేగింపులో కూడా వీరు హాజరుకారు.