King Charles: దక్షిణాసియా టూర్‌కు బ్రిటన్ రాజు.. ఆతిథ్యం ఇవ్వనున్న ప్రధాని మోడీ!
- దక్షిణాసియా టూర్‌కు బ్రిటన్ రాజు దంపతులు
- ఆతిథ్యం ఇవ్వనున్న ప్రధాని మోడీ!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బ్రిటన్ కింగ్ చార్లెస్, సతీమణి క్వీన్ కెమిల్లా దక్షిణాసియా పర్యటనకు శ్రీకారం చుట్టినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. భారత్, బంగ్లాదేశ్, పాకిస్థాన్ దేశాలను సందర్శించే అవకాశం ఉంది. అయితే భారత పర్యటనలో భాగంగా కింగ్ చార్లెస్ దంపతులకు ప్రధాని మోడీ ఆతిథ్యం ఇవ్వనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. కింగ్ చార్లెస్ తల్లి క్వీన్ ఎలిజబెత్ మరణం కారణంగా 2022లో భారత్ పర్యటనను రద్దు చేసుకున్నారు. అయితే ఇటీవల బంగళూరులో అత్యంత రహస్యంగా వారం రోజులు పర్యటించి వెళ్లారు. కానీ ఇప్పుడు అధికారిక పర్యటనలో భాగంగా చార్లెస్ దంపతులు ఇండియాకు రానున్నారు. ఈ నేపథ్యంలో వారికి మోడీ స్పెషల్ విందు ఇవ్వనున్నారు.
ఇది కూడా చదవండి: IPL 2025 Mega Auction: ఢిల్లీకి ఆర్సీబీ కెప్టెన్.. బేస్ ప్రైస్‌కే కొనుగోలు
Also Read
- Iran-Israel Ceasefire: ఇజ్రాయెల్‌తో కాల్పుల విరమణ ప్రకటించిన ఇరాన్.. మళ్లీ దాడులు చేస్తే మాత్రం..!
- Iran-Israel War: శాంతించండి.. దాడులు ఆపాలంటూ ఇరాన్, ఇజ్రాయెల్‌కు భారత్ విజ్ఞప్తి
- Iran Vs Israel: యుద్ధం మళ్లీ మొదలు..! ఇరాన్‌పై ఇజ్రాయెల్ దాడుల వెనుక ఉన్న కారణాలేంటి?
- Putin: పుతిన్ భద్రతపై రష్యా సంచలన నిర్ణయం.. నిఘా వ్యవస్థలపై తాత్కాలికంగా..!
కింగ్ చార్లెస్ (76)కు ఫిబ్రవరి కేన్సర్ నిర్ధారణ అయింది. అయితే ప్రధాని మోడీ యూకేలో పర్యటించినప్పుడు కేన్సర్ చికిత్సకు సంబంధించిన వైద్యం గురించి తెలియజేసినట్లు సమాచారం. ఇందులో భాగంగానే ప్రకృతి సిద్ధమైన వైద్యం కోసం అక్టోబర్‌లో బెంగళూరులో పర్యటించినట్లు తెలుస్తోంది. అయితే ప్రస్తుతం చార్లెస్ ఆరోగ్యం కుదిటపడినట్లు తెలుస్తోంది. దీంతో దక్షిణాసియా పర్యటనకు సిద్ధపడుతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
ఇదిలా ఉంటే బ్రిటన్ రాజుగా చార్లెస్ గత సంవత్సరం 2023, మే నెల 6న పట్టాభిషేకం జరిగింది. 40వ బ్రిటన్ చక్రవర్తిగా ఆయన రికార్డ్ సృష్టించారు. 2022, సెప్టెంబర్‌లో తల్లి ఎలిజబెత్-2 మరణించడంతో చార్లెస్ రాజు అయ్యారు. వెస్ట్ మినిస్టర్ అబేలో సంప్రదాయబద్ధంగా ఈ వేడుక నిర్వహించారు. ఈ వేడుకలకు భారత ఉపరాష్ట్రపతి జగ్దీశ్ ధన్కర్తో సహా ప్రపంచం నలుమూలల నుంచి ప్రతినిధులు తరలివచ్చారు. అయితే ఈ పట్టాభిషేకానికి రూ.765 కోట్లు ఖర్చు చేసినట్లుగా తాజా నివేదికలో వెల్లడైంది. వేదిక కోసమే 50.3 మిలియన్ పౌండ్లు ఖర్చయిందని, పోలీసింగ్ ఖర్చుల కోసం మరో 21.7 మిలియన్ పౌండ్లు ఖర్చయిందని సాంస్కృతిక శాఖ తెలిపింది.
ఇక కింగ్ చార్లెస్-3కి భారత్‌తో ప్రత్యేక అనుబంధం ఉంది. ఆయన యువరాజుగా ఉన్నప్పుడు 2007లో భారత్‌లో పర్యటించారు. 2019 నవంబర్‌లో కూడా ఆయన భారత్‌కు వచ్చారు. ముంబైలో పాఠశాల విద్యార్థులతో కలిసి తన 71వ జన్మదిన వేడుకలు జరుపుకున్నారు. అంతర్జాతీయ వేదికలపై భారత్‌కు కచ్చితంగా తగిన ప్రాధాన్యం ఇవ్వాల్సిందేనని నొక్కిచెప్పేవారు. 2018 ఏప్రిల్‌లో లండన్‌లో భారత ప్రధాని నరేంద్రమోడీతో కలిసి సైన్స్ మ్యూజియం, న్యూ ఆయుర్వేదిక్ సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్‌ను ప్రారంభించారు. భారత సంప్రదాయాలైన ఆయుర్వేదం, యోగాకు చాలా సందర్భాల్లో ప్రచారం కల్పించారు. మోడీ మాటల మేరకే బెంగళూరులో చార్లెస్ దంపతులు వారం రోజులు పర్యటించి వెళ్లారు.
ఇది కూడా చదవండి: Pushpa -2 : సౌత్ ఇండియా నం-1 గా నిలిచిన ‘కిస్సిక్’ సాంగ్
తాజావార్తలు
-
Ram Charan: ఈ సినిమాలో ఆయన నటన చూసి నాకు కంట్లో నీళ్లు వచ్చాయి: రామ్‌చరణ్
-
Vizag Steel Plant Accident: స్టీల్ ప్లాంట్ ప్రమాదం.. దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబు, వైఎస్ జగన్..
-
Delhi High Court: ఊపిరాడక చనిపోవాల్సి వస్తుంది.. ‘దేవుడే కాపాడాలి’.. ఢిల్లీ పరిస్థితిపై హైకోర్టు తీవ్ర ఆందోళన
-
Petrol-Diesel: పెట్రోల్‌లో ఇథనాలు, డీజిల్‌లో ఐసోబ్యుటానాల్.. కేంద్రం మరో నిర్ణయం.!
-
Iran-Israel Ceasefire: ఇజ్రాయెల్‌తో కాల్పుల విరమణ ప్రకటించిన ఇరాన్.. మళ్లీ దాడులు చేస్తే మాత్రం..!
ట్రెండింగ్
-
Manav Suthar Record: అరంగేట్ర స్పిన్నర్ మానవ్ సుతార్ అరుదైన రికార్డు.. ఈ శతాబ్దంలోనే ‘ఒకే ఒక్కడు’!
-
Harmanpreet Kaur: ‘నేను రిటైర్ అవ్వాలనుకుంటున్నారా?’.. రిపోర్టర్ కు ధోనీ స్టైల్లో మహిళా కెప్టెన్ కౌంటర్.!
-
Birth Rate: భారత్‌లో పడిపోతున్న జననాల రేటు.. విద్యావంతులు తక్కువ మంది పిల్లలను కనడమే కారణమా.?
-
Sugar Cravings Control : తీపి తినాలనే కోరికా..? ఈ చిట్కాలతో మీ స్వీట్ క్రేవింగ్స్‌కు చెక్ పెట్టండి.!
-
Monsoon Tips: వర్షాకాలంలో ప్రయాణమా..? ఈ చిన్న జాగ్రత్తలు ప్రాణాలను కాపాడతాయి.!