యునైటెడ్ కింగ్‌డమ్ రాజు చార్లెస్ (76) ఆస్పత్రిలో చేరారు. కేన్సర్ చికిత్సలో భాగంగా ఆస్పత్రిలో చేరినట్లుగా బకింగ్‌హామ్ ప్యాలెస్ గురువారం ప్రకటించింది. కేన్సర్ చికిత్స కారణంగా ఏర్పడిన దుష్పరిణామాల నేపథ్యంలో ఆస్పత్రిలో చేరినట్లుగా పేర్కొంది. ప్రస్తుతం లండన్ ఆస్పత్రిలో వైద్యులు చార్లెస్‌కు వైద్యం అందిస్తున్నారు. చార్లెస్‌ను వైద్య పర్యవేక్షణలో ఉంచినట్లుగా డాక్టర్లు తెలిపారు.
ఇది కూడా చదవండి: Robinhood : రాబిన్ హుడ్ ఓవర్సీస్ ప్రీమియర్ టాక్
ఇదిలా ఉంటే కింగ్ చార్లెస్ ఆస్పత్రిలో చేరిన నేపథ్యంలో గురు, శుక్రవారాల్లో నిర్వహించాల్సిన అధికారిక కార్యక్రమాలన్నీ వాయిదా పడ్డాయి. 2024, ఫిబ్రవరిలో కింగ్ చార్లెస్‌కు కేన్సర్ నిర్ధారణ అయింది. అప్పటి నుంచి ఆయన చికిత్స తీసుకుంటున్నారు. ఆ మధ్య బెంగళూరు కూడా వచ్చి చికిత్స తీసుకున్నట్లుగా వార్తలు వినిపించాయి. చార్లెస్ త్వరగా కోలుకుని ప్రజా విధుల్లో పాల్గొనాలని బకింగ్‌హామ్ ప్యాలెస్ పేర్కొంది. ఇదిలా ఉంటే చార్లెస్ ఏ విధమైన కేన్సర్‌తో బాధపడుతున్నారో మాత్రం ప్యాలెస్ పేర్కొనలేదు.
ఇది కూడా చదవండి: Husband kills wife : భార్యను ముక్కలు, ముక్కలుగా నరికి.. సూట్‌కేస్‌లో దాచిపెట్టిన భర్త.. తర్వాత…