NTV Telugu Site icon

కిమ్ కీల‌క నిర్ణ‌యంః ద‌క్షిణ కొరియాపై వినూత్న యుద్దం…

ఉత్త‌ర‌కొరియా, ద‌క్షిణ కొరియా దేశాల మ‌ధ్య ప‌చ్చ‌గ‌డ్డి వేస్తే భ‌గ్గుమంటున్న సంగ‌తి తెలిసిందే.  ఉత్త‌ర కొరియా అధ్య‌క్షుడు కిమ్ ఎప్పుడు ఎలాంటి నిర్ణ‌యం తీసుకుంటారో తెలియ‌ని ప‌రిస్థితి.  ద‌క్షిణ కొరియా అధునాత‌న దేశంగా అభివృద్ది చెందితే, ఉత్త‌ర కొరియా మాత్రం అందుకు విరుద్దంగా ముందుకు వెళ్తున్న‌ది. ఫ్యాష‌న్ ప్ర‌పంచానికి దూరంగా ఉంటుంది.  ఆ దేశంలో మొబైల్స్ చాలా తక్కువ మందికి మాత్ర‌మే అందుబాటులో ఉంటుంది.  ప్ర‌భుత్వం నిర్ణ‌యించిన హెయిర్‌స్టైయిల్స్ మాత్ర‌మే యువత ఫాలో కావాలి.  ఇంట‌ర్నెట్ సౌక‌ర్యం కుడా పెద్ద‌గా అందుబాటులో ఉండ‌దు.  అయితే, గ‌త కొంత కాలంగా దేశంలో ద‌క్షిణ కొరియాకు చెందిన పాప్ క‌ల్చ‌ర్ దిగుమ‌తి అవుతుండ‌టంతో యువ‌త ఆలోచ‌న‌లు క్ర‌మంగా మారుతున్నాయి.  ఈ విష‌యాన్ని ప‌సిగ‌ట్టిన కిమ్ దేశంలో పాప్ క‌ల్చ‌ర్ పై నిషేదం విధించారు.  దేశంలో కే క‌ల్చ‌ర్ ని క్యాన్స‌ర్ వ్యాధితో పోల్చారు.  కె క‌ల్చ‌ర్ వ‌ల‌న వేష‌ధార‌ణ‌, హెయిర్‌స్టైయిల్‌, సంస్కృతిపై నాశ‌నం అవుతున్నాయ‌ని వీటిని నిషేదించాల‌ని కిమ్ చూస్తున్నారు.  పాప్ క‌ల్చ‌ర్‌తో ద‌క్షిణ‌కొరియాలో ఎక్కువ‌మంది ఉపాది పొందుతున్నారు.  వీరు ఎక్కువ‌గా నార్త్ కొరియాలో ప్ర‌ద‌ర్శ‌న‌లు ఇస్తుంటారు.  వీటిపై నిషేదం విధించ‌డం వ‌ల‌న దక్షిణ కొరియాకు చెందిన పాప్ క‌ల్చ‌ర్‌ను దేశంలోకి రాకుండా అడ్డుకొవ‌చ్చని, ఫ‌లితంగా యువ‌తపై ప‌ట్టు కొల్పోకుండా ఉంటామ‌ని కిమ్ ఆలోచ‌న‌.  

Show comments