Kim Jong Un: ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ ఆరోగ్యంపై మరోసారి వదంతులు వ్యాపిస్తున్నాయి. గత 40 రోజుల నుంచి కిమ్ జాడ తెలియకపోవడంతో అతని ఆరోగ్యం దెబ్బతిందనే ఊహాగానాలు తెరపైకి వచ్చాయి. పలు కీలక సమావేశాలకు కిమ్ పాల్గొనకపోవడం కూడా అనుమానాలకు తావిస్తోంది. నార్త్ కొరియా రాజధాని ప్యాంగ్యాంగ్ లో ఈ వారం కొరియన్ పీపుల్స్ ఆర్మీ 75వ వ్యవస్థాపక వార్షికోత్సవం జరగనుంది. దీనికి ముందు కిమ్ కనిపించకుండా పోవడంతో అందర్నిలో అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. చివరిసారిగా 2014లో చాలా రోజుల పాటు కిమ్ కనిపించకుండా ఉన్నారు. ఆ తరువాత ఇప్పుడు సుదీర్ఘంగా 40 రోజుల పాటు జాడ లేకుండా ఉన్నారు.
Read Also: Natasha Perianayagam: ప్రపంచంలోనే అత్యంత తెలివైన విద్యార్థినిగా భారతీయ-అమెరికన్
ఆదివారం జరిగిన పోలిట్ బ్యూరో మీటింగ్ కు కిమ్ హాజరు కాలేదు. మంగళవారం లేదా బుధవారం ప్యాంగ్యాంగ్ లో కొరియన్ ఆర్మీ మాస్ పెరేడ్ జరగనుంది. ఈ పెరేడ్ లో అణ్వాయుధాలు, క్షిపణులను ప్రదర్శించే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ఎలాంటి ఆయుధాలను కిమ్ ప్రదర్శిస్తారనే దానిపై నార్త్ కొరియా చుట్టుపక్కల దేశాల్లో ఆందోళన పెరిగింది. ఇదిలా ఉంటే సోమవారం మిలిటరీ కమిషన్ సమావేశానికి కిమ్ హాజరైనట్లు స్థానిక మీడియా పేర్కొంది. అయితే దీనికి సంబంధించిన ఫోటోలు బయటకు రాలేదు. యుద్ధ సన్నద్ధతను మెరుగుపరుచుకోవాలని, ఇతర రాజకీయ అంశాలపై కిమ్ చర్చించిటన్లు స్థానిక కొరియన్ మీడియా వెల్లడించింది.
2022లో ఉత్తర కొరియా 70 కన్నా ఎక్కువ బాలిస్టిక్ క్షిపణులను ప్రయోగించింది. ఇందులో చాలా వరకు దక్షిణ కొరియా, యూఎస్ఏ ప్రధాన భూభాగాలను కూడా చేరుకునే క్షిపణులు ఉన్నాయి. అమెరికా రక్షణ మంత్రి దక్షిణ కొరియాను సందర్శించడాన్ని ఉత్తర కొరియా ఖండించింది. అమెరికా ఉద్రక్త పరిస్థితులకు స్వస్తి పలికే వరకు చర్చలకు ఆస్కారమే లేదని స్పష్టం చేసింది.