Kim Jong Un Reveals Daughter To World For 1st Time: ఉత్తర కొరియా ఓ రహస్య దేశం. అక్కడి ప్రజలకు ప్రపంచం గురించి తెలిసింది చాలా తక్కువ. ఆ దేశంలో ఏం జరుగుతుందో కూడా ప్రపంచానికి తెలియదు. ఇక అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ గురించి వ్యక్తిగత విషయాలు చాలా వరకు రహస్యంగానే ఉంటాయి. కిమ్ జోంగ్ ఉన్ భార్య రి సోల్ జు కూడా బయటి ప్రపంచానికి కనిపించడం చాలా అరుదు. ఆమె గురించి వార్తలు కూడా చాలా వరకు పుకార్లుగానే ఉంటాయి. ఇదిలా ఉంటే కిమ్ పిల్లల గురించి వివరాలు చాలా వరకు ప్రపంచానికి తెలియదు. ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ కు ముగ్గుర పిల్లలు ఉన్నాట్లుగా సమాచారం. ఇందులో ఇద్దరు అమ్మాయిలు కాగా.. ఒకరు అబ్బాయి అని చాలా మంది అనుకుంటారు. చివరిసారిగా ఏడు నెలల క్రితం చివరిసారిగా కిమ్ భార్య రిసోల్ జు కనిపించారు.
Read Also: Parliament Winter session: పార్లమెంట్ శీతాకాల సమావేశాలకు షెడ్యూల్ ఖరారు..
ఇదిలా ఉంటే తొలిసారిగా ఉత్తర కొరియా నియంత కిమ్ తన కుమార్తెతో కనిపించారు. కుమార్తెను పట్టుకుని సైనిక వివరాలను వెల్లడిస్తున్నట్లుగా ఫోటోలో స్పష్టంగా తెలుస్తోంది. తొలిసారిగా తన కుమార్తెను ప్రపంచానికి పరిచయం చేసినట్లు అయింది. ఇప్పటి వరకు కిమ్ సంతానం బయటి ప్రపంచానికి తెలియదు. ప్రస్తుతం ఆమె ఫోటో ఇంటర్నెట్ లో వైరల్ అయింది. హైలెట్ ఏంటంటే.. కిమ్ కు కుమార్తె ఉండటం, ఆమె ఉనికిని ఇప్పటి వరకు ధృవీకరించకపోవడం. అయితే ఆమె పేరును మాత్రం ఉత్తకొరియా మీడియా కేసీఎన్ఏ వెల్లడించలేదు. ఉత్తర కొరియా శుక్రవారం హస్వాంగ్-17 ఖండాంతర క్షిపణిని పరీక్షించినట్లు శనివారం ఉత్తర కొరియా వార్తసంస్థ కేసీఎన్ఏ ప్రకటించింది.
2013లో రిటైర్డ్ అమెరికన్ బాస్కెట్ బాల్ స్టార్ డెన్నిస్ రాడ్ మాన్ కిమ్ జోంగ్ ఉన్ కు ‘జు ఏ’ అనే కుమార్తె ఉందని తెలిపారు. ఉత్తర కొరియా పర్యటన తర్వాత అమెరికన్ ఛానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో రాడ్ మన్, కిమ్ కుటుంబ సభ్యులతో గడిపినట్లు వెల్లడించారు. ప్రస్తుతం కిమ్ కూతురు జూఏ వయస్సు 12-13 ఏళ్లు ఉంటాయని అంచనా. మరో నాలుగైదు ఏళ్లలో ఆమె యూనివర్సిటీకి లేదా సైనిక సేవల్లోకి వెళ్లేందుకు సిద్ధం అవుతున్నారని పలువురు అంచనా వేస్తున్నారు. కిమ్ వంశంలో నాలుగో తరం వారసురాలు బయటి ప్రపంచానికి తొలిసారిగా పరిచయం అయినట్లైంది.