NTV Telugu Site icon

North Korea: టెర్రర్ గ్రూపులకు నార్త్ కొరియా ఆయుధాలు.. విక్రయించేందుకు కిమ్ ప్రయత్నం..

Kim Jong Un

Kim Jong Un

North Korea: ఇజ్రాయిల్-హమాస్ యుద్ధం కేవలం మధ్యప్రాచ్యానికే కాకుండా యావత్ ప్రపంచాన్ని కలవరపెడుతోంది. ఇజ్రాయిల్‌కి మద్దతుగా యూరప్, అమెరికా దేశాలు నిలిస్తే, పాలస్తీనాకు మద్దతుగా అరబ్ ప్రపంచం నిలబడుతోంది. ఈ నేపథ్యంలో ఇజ్రాయిల్ పై ఒక్క హమాస్ కాకుండా లెబనాన్ నుంచి హిజ్బుల్లా, యెమెన్ హౌతీ తిరుగుబాటుదారులు దాడులు చేసేందుకు సిద్ధమవుతున్నారు. అయితే వీరి వద్ద అత్యాధునిక ఆయుధాలు, రాకెట్లు, క్షిపణులు ఉన్నాయి. ఇవన్నీ ఎలా వచ్చాయనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి.

ఈ నేపథ్యంలో ఉత్తర కొరియా అధినేత కిమ్ జోంగ్ ఉన్ మధ్యప్రాచ్యంలోని టెర్రర్ గ్రూపులకు ఆయుధాలు విక్రయించే అవకాశం ఉందని దక్షిణ కొరియా గూఢచార సంస్థ తెలిపింది. అణుకార్యక్రమాల కారణంగా ఆంక్షలు ఎదుర్కొంటున్న ఉత్తర కొరియా, గతంలో హమాస్ ఉగ్రసంస్థకు యాంటీ ట్యాంక్ రాకెట్ లాంచర్ విక్రయించిందని, దక్షిణ కొరియా చట్టసభ సభ్యులు తెలిపారు. గాజాలో యుద్ధం మధ్య ఉత్తరకొరియా మరిన్ని ఆయుధాలు ఎగుమతి చేసేందుకు ప్రయత్నించవచ్చని వాల్ స్ట్రీట్ జర్నల్ నివేదిక వెల్లడించింది. యుద్ధం నుంచి ప్రయోజన పొందేందుకు కిమ్ జోంగ్ ఉన్ పాలస్తీనాకు విస్తృత మద్దతు ప్రకటించారని దక్షిణ కొరియా ఇంటలిజెన్స్ ఏజెన్సీ డైరెక్టర్ కిమ్ క్యూ హ్యూన్ చట్టసభ సభ్యులకు వెల్లడించారు.

Read Also: Relationship: క్లాస్‌మేట్‌తో 14 ఏళ్ల బాలిక రిలేషన్‌షిప్.. తండ్రి ఏం చేశాడంటే..?

అక్టోబర్ 7న ఇజ్రాయిల్ పై హమాస్ దాడి చేసింది. హమాస్ ఉత్తర కొరియాకు చెందిన ఎఫ్-7 రాకెట్ ప్రొపెల్డ్ గ్రెనేడ్స్ ఉపయోగించిందని, ఇది సాధారణంగా భుజంపై పెట్టుకుని కాల్చేయవచ్చని, సాయుధ వాహనాలను ధ్వంసం చేసేందుకు ఉపయోగిస్తారని దక్షిణ కొరియా అధికారులు తెలిపారు. అయితే ఈ ఆరోపణల్ని నార్త్ కొరియా ఖండించింది, ఇది అమెరికా నిరాధారమైన పుకార్లుగా పేర్కొంది.

అక్టోబర్ 7న ఇజ్రాయిల్ పై హమాస్ ఉగ్రవాదులు దాడి చేశారు. 1400 మందిని చంపేశారు. 200 మందికి పైగా ఇజ్రాయిలీ పౌరుల్ని బందీలుగా గాజాలోకి తీసుకెళ్లారు. దీని తర్వాత గాజాస్ట్రిప్ పై ఇజ్రాయిల్ వైమానిక దాడులు చేస్తోంది. ఈ దాడుల వల్ల 8500 మంది పాలస్తీనా ప్రజలు మరణించారు. ఇందులో కొందరు ఉగ్రవాదులు ఉండగా, చాలా మంది సాధారణ ప్రజలే ఉన్నారు.

Show comments