Site icon NTV Telugu

Donald Trump: ‘‘ఖమేనీని చంపడం కష్టమేం కాదు’’.. ఇరాన్‌కి ట్రంప్ వార్నింగ్..

Trump

Trump

Donald Trump: ఇజ్రాయిల్-ఇరాన్ యుద్ధం నేపథ్యంలో మరోసారి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్‌కి తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. ట్రూత్ సోషల్ పోస్టులో ‘‘ఇప్పటికీ ఇరాన్ సుప్రీం లీడర్ అలీ ఖమేనీని అంతమొందించడానికి తాను చర్యలు తీసుకోను, అమెరికా ఖమేనీని హత్య చేయగలదని, కానీ ప్రస్తుతానికి అలా చేయడం లేదని’’ అని అన్నారు. ‘‘షరతులు లేకుండా లొంగిపోండి’’ అంటూ గట్టి హెచ్చరిక చేశారు.

Read Also: Ahmedabad plane crash: DNA ద్వారా 163 మృతదేహాల గుర్తింపు.. 124 మృతదేహాలు కుటుంబాలకు అప్పగింత..!

ఇలా చేయకపోవడానికి ఒకే ఒక్క కారణం అమెరికా పౌరులు, దళాలపై ప్రతీకార దాడులు నిరోధించడానికే అని అన్నారు. “‘సుప్రీం లీడర్’ అని పిలవబడే వ్యక్తి ఎక్కడ దాక్కున్నాడో మాకు ఖచ్చితంగా తెలుసు. అతను సులభమైన లక్ష్యం, కానీ అక్కడ సురక్షితంగా ఉన్నాడు – మేము అతన్ని చంపబోము. ప్రస్తుతానికి అలా చేయము’’ అని ట్రంప్ తన సోషల్ మీడియా అకౌంట్‌లో అన్నారు. ‘‘మేము పౌరులపై లేదా అమెరికన్ సైనికులపై క్షిపణులు ప్రయోగించాలని మేము కోరుకోవడం లేదు. ఎంతో ఓపికతో ఉన్నాము’’ అని చెప్పారు.

Exit mobile version