Site icon NTV Telugu

Khalistani terrorist: “ఢిల్లీ ఖలిస్తాన్ అవుతుంది”.. అజిత్ దోవల్‌కు టెర్రరిస్టు బెదిరింపులు..

Khalistani Terrorist

Khalistani Terrorist

Khalistani terrorist: కెనడాలో ఉంటూ, ఖలిస్తాన్ అంటూ గొడవ చేసే ఉగ్రవాదులు భారత్‌ను బెదిరించే ప్రయత్నం చేస్తున్నారు. తాజాగా, జాతీయ భద్రతా సలహాదారు (ఎన్ఎస్ఏ) అజిత్ దోవల్‌కు ఖలిస్తానీ ఉగ్రవాది ఇందర్ జీత్ గోసల్ బెదిరింపులు జారీ చేశారు. అరెస్ట్ అయిన కొద్ది రోజులకే కెనడాలో బెయిల్ పొందిన ఇందర్ జీత్ ‘‘ దోవల్, నేను మీ కోసం ఎదురు చూస్తున్నాను’’ అని వార్నింగ్ ఇచ్చాడు.

Read Also: Pregnant Woman: పెళ్లైన ఐదు నెలలకే.. భర్త తనతో కలిసి తినడానికి నిరాకరించాడని భార్య దారుణం..

ఒంటారియోలోని సెంట్రల్ ఈస్ట్ కరెక్షనల్ సెంటర్ నుండి బయలుదేరిన వెంటనే, మరో ఖలిస్తానీ ఉగ్రవాది, సిఖ్ ఫర్ జస్టిస్ చీఫ్ గురుపత్వంత్ సింగ్ పన్నూతో కలిసి కనిపించాడు. ఒక వీడియో సందేశంలో ఇందర్ జీత్ మాట్లాడుతూ.. ‘‘ భారతదేశమా, నేను ఇప్పుడు స్వేచ్ఛగా ఉన్నాను. నేను గురుపత్వంత్ సింగ్ పన్నూ వెంటే ఉంటాను. నవంబర్ 23, 2025న ఖలిస్తాన్ ప్రజాభిప్రాయ సేకరణను నిర్వహించడానికి పని చేస్తాను.. ఢిల్లీ ఖలిస్తాన్‌గా మారుతుంది’’ అని అన్నాడు.

పన్నూ కూడా దోవల్‌ని టార్గెట్ చేస్తూ.. ‘‘ అజిత్ దోవల్, మీరు కెనడా, అమెరికా, ఏదైనా యూరప్ దేశం వచ్చి అరెస్ట్ చేయడానికి ఎందుకు ప్రయత్నించకూడదు. దోవల్, నేను మీ కోసం ఎదురుచూస్తున్నాను’’ అని అన్నాడు.

Exit mobile version