Site icon NTV Telugu

UK Warns: గాజాలో కాల్పులు ఆపకపోతే పాలస్తీనాకే మద్దతిస్తాం.. బ్రిటన్‌పై మండిపడ్డ నెతన్యాహు

Uk Warns

Uk Warns

గాజాలో కాల్పులు ఆపకపోతే పాలస్తీనాను దేశంగా గుర్తిస్తామంటూ ఫ్రాన్స్ అధ్యక్షుడు మాక్రాన్ ఇప్పటికే హెచ్చరించారు. తాజాగా ఆ జాబితాలో బ్రిటన్ ప్రధాని స్టార్మర్ కూడా చేశారు. గాజాలో కాల్పుల విరమణ విఫలమైతే పాలస్తీనాను దేశంగా గుర్తిస్తుందని ఇజ్రాయెల్‌కు స్టార్మర్ హెచ్చరించారు. తక్షణమే ఇజ్రాయెల్ కాల్పుల విరమణకు అంగీకరించాలని డిమాండ్ చేశారు. గాజాలో మానవతా పరిస్థితులు మెరుగుపడాలని.. ఐక్యరాజ్యసమితి సహాయం అందించడానికి అనుమతించాలని కోరారు. లేదంటే సెప్టెంబర్‌లో పాలస్తీనా దేశాన్ని అధికారికంగా గుర్తిస్తుందని యునైటెడ్ కింగ్‌డమ్ ప్రధానమంత్రి కీర్ స్టార్మర్ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు.

ఇది కూడా చదవండి: Trump: దగ్గర పడ్డ ట్రంప్ డెడ్‌‌లైన్.. భారత్‌‌కు తాజా హెచ్చరిక ఇదే

గాజాలో దీర్ఘకాలిక కాల్పుల విరమణకు ఇజ్రాయెల్ అంగీకరించాల్సిందేనని స్టార్మర్ తెలిపారు. గాజాలో ఇజ్రాయెల్ శాంతికి కట్టుబడి ఉండాలన్నారు. యూఎన్ సహాయ సరఫరాకు అనుమతించాలని డిమాండ్ చేశారు. ఆకలి బాధతో శిశువులు అలమటిస్తున్నారని.. ఇప్పటికైనా బాధలు అంతం కావాలని విజ్ఞప్తి చేశారు.

ఇది కూడా చదవండి: Lokesh ; అజిత్‌తో సినిమా ప్లాన్‌పై లోకేష్ ఆసక్తికర వ్యాఖ్యలు!

బ్రిటన్ ప్రధాని స్టార్మర్ బెదిరింపులపై ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు స్ట్రాంగ్‌గా స్పందించారు. అలాంటి చర్యకు దిగితే ఎదురుదెబ్బ తగులుతుందని హెచ్చరించారు. జిహాదిస్ట్ ఉగ్రవాదల పట్ల బుజ్జగింపు ఎప్పటికైనా విఫలమవుతుందన్నారు. స్టార్మర్.. క్రూరమైన ఉగ్రవాదానికి మద్దతిస్తున్నారని.. బాధితులను శిక్షిస్తున్నారని మండిపడ్డారు. స్టార్మర్ ప్రయత్నాలు విఫలం అవుతాయని నెతాన్యాహు పేర్కొ్న్నారు.

Exit mobile version