Keir Starmer: బ్రిటిష్ ప్రధాని కీర్ స్టార్మర్కు పదవీ గండం.. యూకేలో అసలేం జరుగుతోంది?
- బ్రిటిష్ ప్రధాని కీర్ స్టార్మర్కు పదవీ గండం
- రాజీనామా చేయాలంటూ తీవ్ర ఒత్తిడి
- కేబినెట్ సమావేశానికి ముందు స్టార్మర్కు షాక్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బ్రిటన్ ప్రధాని కీర్ స్టార్మర్కు పదవీ గండం పొంచి ఉందా? సొంత వాళ్ల నుంచే తీవ్ర ఒత్తిడి పెరుగుతోందా? పెద్ద ఎత్తున రాజీనామాకు డిమాండ్ ఎందుకు పెరిగింది. యూకేలో అసలేం జరుగుతోంది. తెలియాలంటే ఈ వార్త చదవాల్సిందే.
బ్రిటన్ ప్రధాని కీర్ స్టార్మర్ ప్రస్తుతం తీవ్ర రాజకీయ ఒత్తిడిని ఎదుర్కొంటున్నారు. అధికార లేబర్ పార్టీలో అంతర్గత విభేదాలు తీవ్ర స్థాయికి చేరాయి. దాదాపు 80 మందికి పైగా ఎంపీలు తక్షణమే రాజీనామా చేయాలని కీర్ స్టార్మర్పై బహిరంగంగా డిమాండ్ చేస్తున్నారు. సీనియర్ మంత్రులతో సమావేశానికి ముందు కీర్ స్టార్మర్ పెద్ద ఎత్తున ఒత్తిడి పెరిగినట్లుగా బ్రిటిష్ మీడియా వెల్లడించింది. ఈ పరిణామాలు బ్రిటిష్ రాజకీయాల్లో తీవ్ర కలకలం రేపుతోంది.
Also Read
- Ganga Aarti in London: లండన్లో తొలిసారి గంగా హారతి.. థేమ్స్ నది తీరంలో ఆధ్యాత్మిక సందడి.!
- Oman Coast Ship Attack: ఒమన్ తీరంలో భారతీయ సిబ్బంది ఉన్న నౌకపై దాడి.. ఒకరు గల్లంతు
- US China AI race: AIని గెలిచిన దేశానిదే ప్రపంచ ఆధిపత్యం.. ట్రంప్ సంచలన వ్యాఖ్యలు
- Bangladesh: ‘‘ప్రతీసారి భారత్ గురించి ఆలోచించం, హసీనా మాదిరి ఉండదు’’.. బంగ్లాదేశ్ పొగరు మాటలు..
గత వారం జరిగిన స్థానిక ఎన్నికల్లో లేబర్ పార్టీ ఘోరంగా ఓడిపోయింది. దీంతో పార్టీలో అంతర్గత అసంతృప్తి విపరీతంగా పెరిగింది. ఇటీవల సంవత్సరాల్లో లేబర్ పార్టీకి ఎదురైన అతిపెద్ద ఎన్నికల ఎదురుదెబ్బల్లో ఒకటిగా విశ్లేషకులు చెబుతున్నానారు. ఓటమికి బాధ్యత వహిస్తూ ఇప్పటికే పలువురు మంత్రుల సహాయకులు రాజీనామా చేశారు. ఇప్పుడు మరో 80 మంది ఎంపీలు కీర్ స్టార్మర్ తక్షణమే పదవి నుంచి తప్పుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఇక మంగళవారం అత్యంత కీలక కేబినెట్ సమావేశం జరగనుంది. ఈ సమావేశానికి ముందు సహచరులతో స్టార్మర్ కీలక చర్చలు జరుపుతున్నారు. బ్రిటిష్ మీడియా కథనాల ప్రకారం సీనియర్ మంత్రులు షబానా మహమూద్, ఇవెట్ కూపర్.. ఎప్పుడు పదవి నుంచి వీడతారనే దానిపై స్పష్టంగా తెలియజేయాలని సూచించినట్లు సమాచారం.
అయితే సొంత పార్టీ ఎంపీల నుంచి ఒత్తిడి వస్తున్నా.. కీర్ స్టార్మర్ మాత్రం రాజీనామా చేయబోనని స్పష్టం చేశారు. మరోసారి నాయకత్వ పోరుకు దిగితే దేశం లేబర్ పార్టీని ఎప్పటికీ క్షమించబోదని వ్యాఖ్యానించారు. ఇదిలా ఉంటే స్టార్మర్ ప్రధాని పదవికి రాజీనామా చేస్తే బ్రిటన్లో పలు కీలక రాజకీయ పరిణామాలు చోటుచేసుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. లేబర్ పార్టీ అంతర్గతంగా కొత్త నాయకత్వ ఎన్నికలు నిర్వహించే అవకాశం ఉంది. కొత్త పార్టీ నేతే తదుపరి ప్రధానిగా బాధ్యతలు చేపడతారు. ప్రస్తుతం బ్రిటిష్ మీడియాలో వెస్ స్ట్రీటింగ్, ఏంజెలా రేనర్, ఆండీ బర్న్హామ్ పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. ఇక కొత్త నాయకుడు ఎన్నికయ్యే వరకు సీనియర్ కేబినెట్ మంత్రి తాత్కాలిక ప్రధానిగా వ్యవహరించే అవకాశం ఉంది.
ఇప్పటికే స్థానిక ఎన్నికల ఫలితాల తర్వాత బ్రిటన్ రాజకీయ పరిస్థితులపై పెట్టుబడిదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నాయకత్వ సంక్షోభం కొనసాగితే ఆర్థిక వ్యవస్థపై కూడా ప్రభావం పడే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఒకవేళ స్టార్మర్ రాజీనామా చేయాల్సి వస్తే వెంటనే సాధారణ ఎన్నికలు జరగకపోవచ్చు.
తాజావార్తలు
-
Ganga Aarti in London: లండన్లో తొలిసారి గంగా హారతి.. థేమ్స్ నది తీరంలో ఆధ్యాత్మిక సందడి.!
-
iPhone 17 Pro Discount: ఐఫోన్ 17 ప్రోపై ఊహించని డిస్కౌంట్.. రూ.69,990కే సొంతం చేసుకునే ఛాన్స్!
-
Ketika Sharma : హిట్ వచ్చింది కానీ ఆఫర్స్ మాత్రం రావడం లేదు
-
Parag Shah Turns Beggar: రూ.3,400 కోట్ల ఆస్తులున్న ఎమ్మెల్యే.. ఒక్కరోజు బిచ్చగాడిగా.. వైరల్గా మారిన ఘటన
-
BYD Denza India Launch: భారత్లోకి మరో లగ్జరీ కార్ బ్రాండ్.. లగ్జరీ కార్ల మార్కెట్లో కొత్త సంచలనం..
ట్రెండింగ్
-
Ragi Drumstick Leaves Roti: డయాబెటిస్, బీపీ ఉన్నవారికి సంపూర్ణ ఆహారం.. సంపూర్ణ పోషణనిచ్చే ‘రాగి మునగాకు రొట్టె’ చేసేయండి ఇలా.!
-
Beetroot Pachadi: బీట్రూట్ అంటే నచ్చదా? ఇలా పచ్చడి చేసి పెట్టండి.. ప్లేట్ మొత్తం ఖాళీ చేసేస్తారు.!
-
India Women: నాలుగింటిలో నాలుగు.. ఆరింటిలో నాలుగు.. ఆసియా కప్లో భారత్ హవా!
-
Rajyogam: 200 ఏళ్ల తర్వాత అరుదైన యోగం.. ఈ 5 రాశుల వారికి పట్టిందల్లా బంగారమే..!
-
Chamari Athapaththu: మేము చెత్తగా ఆడాం.. కన్నీరు ఆపుకోలేకపోయాను.. శ్రీలంక కెప్టెన్ భావోద్వేగం!