Pakistan: పాకిస్తాన్ దేశంలో ఇప్పుడు కొత్త ట్రెండ్ నడుస్తోంది. ఇటీవల కాలంలో మేకలు, ఇతర పశువుల దొంగతనాలు పెరగుతున్నాయి. ముస్లింలకు పవిత్ర పండగ బక్రీద్(ఈద్ ఉల్ అధా) సమీపిస్తున్న సమయంలో జంతువులను బలిచ్చేందుకు చాలా మంది దొంగతనాలకు పాల్పడుతున్నారు. ముఖ్యంగా పాకిస్తాన్ ఆర్థిక రాజధాని కరాచీలో ఇటీవల కాలంలో ఇటువంటి నేరాలు ఎక్కువగా పెరిగాయి. వేలు, లక్షల్లో విక్రయించబడుతున్న జంతువులను అమ్మేందుకు వెళ్తున్న వారిని టార్గెట్ చేసుకుని వాటిని దొంగిలిస్తున్నారు.
సింధ్ ప్రావిన్సుల్లో పోలీస్ నివేదిక ప్రకారం.. 2023 మొదటి 5 నెల్లలో వీధి నేరాలు బాగా పెరిగాయి. 3000 కన్నా ఎక్కువ సంఘటనలు నమోదయ్యాయి. వీటిని అడ్డుకునేందుకు ప్రయత్నించిన 46 మంది మరణించారు. 21,000 కన్నా ఎక్కువ మొబైల్ ఫోన్లు, 20,000 కన్నా ఎక్కువ మోటార్ సైకిళ్లు చోరీకి గురయ్యాయి. ప్రజలను దోచుకోవడమే కాకుండా జంతువులను కూడా దొంగిలిస్తున్నారు. రెస్టారెంట్ల నుంచి శ్మశాన వాటికల దాకా ఏ ఒక్కదాన్ని వదిలిపెట్టకుండా దొంగతనాలు చేస్తున్నారు.
Read Also: Tammareddy Bharadwaj: ప్రాజెక్ట్ కె.. మొదటి రోజే రూ. 500 కోట్లు రాబడుతుంది.. ప్రభాస్ రేంజ్ అది
బక్రీద్ పండగ దగ్గరపడుతుండటంతో బలిచ్చేందుకు జంతువులను దొంగిలిస్తున్నారు. గత వారం ఇద్దరు మోటార్ సైకిల్ పై వచ్చి, లారీ డ్రైవర్ కి తుపాకీతో గురిపెట్టి, అందులో ఉన్న మేకల్ని దొంగిలించారు. పాకిస్తాన్ లో ప్రస్తుతం ఆర్థిక, రాజకీయ సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. ప్రజలకు నిత్యావసరాలే కరువయ్యాయి. కొందాం అనుకున్న దొరకని పరిస్థితి ఉంది. ప్రజలకు పనులు లేక ఆదాయం తగ్గింది. ఈ నేపథ్యంలో పలువురు చోరీలకు పాల్పడుతున్నారని అక్కడి నిపుణులు చెబుతున్నారు.
మరోవైపు 1.7 జనాభా ఉన్న కరాచీ నగరంలో పోలీసులు వీధి దోపిడీలను కట్టడి చేసేందుకు కష్టపడుతున్నారు. ప్రస్తుతం నగరంలో 1.28 లక్షల మంది పోలీస్ సిబ్బంది మాత్రమే ఉన్నారు. వీరంతా ప్రతీ ప్రాంతాల్లో పెట్రోలింగ్ చేయడం కష్టంగా మారిందని పోలీస్ ఉన్నతాధికారి మహ్మద్ తారిక్ ముఘల్ అన్నారు. నేరస్తులను ఎదుర్కొనేందుకు ప్రత్యేకంగా షాహీన్స్ దళాల్నీ ఏర్పాటు చేశామని తెలిపారు.