Kamala Harris vs Donald Trump: అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డెమోక్రటిక్ అభ్యర్థిగా ఆఫ్రికా- భారత సంతతి అమెరికన్ కమలా హారిస్ కు అన్నివైపుల నుంచి సపోర్టు లభిస్తుంది. ఈ తరుణంలో ఆమె తన ప్రత్యర్థి అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్‌ను ఎదుర్కొనేందుకు సిద్ధమవుతున్నారు. ఆయనతో ముఖాముఖి చర్చకు తాను సిద్ధమని తాజాగా తెలిపింది. కానీ, ట్రంప్ మాత్రం అందుకు ఒప్పుకోలేదు.. డెమోక్రాట్లు తమ అధ్యక్ష అభ్యర్థిని అధికారికంగా నిర్ణయించేవరకు వేచి చూస్తానని తెలిపారు.
Read Also: Army Jawan: నల్లగొండలో తీవ్ర విషాదం.. అనారోగ్యంతో ఆర్మీ జవాన్ మృతి..
కాగా, గత నెల 27వ తేదీన జరిగిన టీవీ రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్, డెమోక్రాట్ల అభ్యర్థి జో బైడెన్ మధ్య జరిగిన ముఖా ముఖినీ ప్రపంచమంతా ఆసక్తిగా చూసింది. ఈ చర్చలో ఇరువురు నేతలు ఒకరిపై ఒకరు తీవ్రంగా విమర్శలు గుప్పించుకున్నారు. అయితే, ఈ డిబేట్ లో బైడెన్ తడబాటుతో పాటు ట్రంప్ జోరుతో పై చేయి సాధించడంతో యూఎస్ అధ్యక్షుడికి సొంత పక్షం నుంచి విమర్శలు రావడంతో.. ఆయన అధ్యక్ష రేసు నుంచి వైదొలుగుతున్నట్లు వెల్లడించారు. అదే టైంలో డెమోక్రటిక్ అభ్యర్థిగా బరిలో నిలిచేందుకు కావాల్సిన మద్దతును కమలా హారిస్‌కు ఇచ్చాడు.
Read Also: Katrina Kaif: వాట్ ఏ ఫిల్మ్.. విజయ్ సినిమాపై కత్రినా కైఫ్ పొగడ్తలు!
అయితే, అభ్యర్థి ఎంపిక ప్రక్రియను వచ్చే నెల 1వ తేదీ నుంచి వర్చువల్‌గా స్టార్ట్ చేసి 7వ తేదీ నాటికి పూర్తి చేయాలని డెమోక్రాటిక్ పార్టీ నేతలు యోచిస్తున్నారు. ఆ తర్వాత షికాగోలో 19 నుంచి 22 వరకూ జరిగే పార్టీ సదస్సులో అధికారికంగా అభ్యర్థిని ప్రకటించనున్నారు. మరోవైపు రిపబ్లికన్ పార్టీ అభ్యర్థిగా డొనాల్డ్ ట్రంప్ పేరుకు ఆమోదం లభించింది.