NTV Telugu Site icon

Kamala Harris: డెమోక్రటిక్‌ పార్టీ తరపున అమెరికా అధ్యక్ష అభ్యర్థిగా కమలా హారిస్‌ ఫిక్స్..!

Kamala

Kamala

Kamala Harris: డెమోక్రటిక్‌ పార్టీ నుంచి అమెరికా అధ్యక్ష అభ్యర్థిగా కమలా హారిస్‌ పేరు దాదాపు ఖరారు అయింది. ఈ విషయాన్ని ఆమె ట్విట్టర్ (ఎక్స్‌)లో అధికారికంగా తెలిపింది. ఇందుకు సంబంధించిన దరఖాస్తుపై సంతకం చేసినట్లు చెప్పుకొచ్చింది. అన్ని ఓట్లూ సాధించేందుకు కృషి చేస్తా.. నవంబర్‌లో ప్రజాబలంతో నడుస్తున్న ప్రచారమే గెలుస్తుంది అని హారిస్ వ్యాఖ్యానించారు. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ ఇటీవల అధ్యక్ష రేసు నుంచి వైదొలుగుతున్నట్లు ప్రకటించారు. దీంతో కమలా హారిస్‌ వివిధ పక్షాల సపోర్టు కూడ గట్టి డెమోక్రటిక్‌ పార్టీ తరపున అధ్యక్ష అభ్యర్థిగా బరిలో నిలిచారు.

Read Also: Road Accident: దైవ దర్శనానికి వెళ్తుండగా ఘోర రోడ్డు ప్రమాదం..

మరోవైపు, అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డెమోక్రటిక్‌ అభ్యర్థిగా పోటీ చేస్తున్న కమలా హారిస్‌కు మాజీ అధ్యక్షుడు బరాక్‌ ఒబామా దంపతులు మద్దతు ఇచ్చారు. అధికారికంగా ఇంకా అభ్యర్థిత్వం ఫిక్స్ కాకపోయినా.. పార్టీలో కీలక నేతలంతా ఆమెకు సపోర్ట్ ఇస్తున్నారు. అయితే, తొలుత ఒబామా రియాక్ట్ కాలేదు.. దీంతో కమల అభ్యర్థిత్వంపై ఆయన అసంతృప్తిగా ఉన్నట్లు పలు వార్తలు చక్కర్లు కొట్టాయి. వాటికి తెరదించుతూ కమలా హారిస్‌తో ఒబామా దంపతులు ఫోన్‌లో మాట్లాడుతూ.. అమెరికాకు అధ్యక్షురాలు అవుతారని మేం భావిస్తున్నాం.. మా పూర్తి మద్దతును హారిస్ కే ఇస్తున్నట్లు పేర్కొన్నారు. నవంబరు 5వ తేదీన జరగనున్న అధ్యక్ష ఎన్నికల్లో కమల గెలుపుకు కృషి చేస్తామని ఒబామా వెల్లడించారు.