Site icon NTV Telugu

Kamala Harris: డ్యాన్స్‌తో అదరగొట్టిన కమలా హారిస్.. వీడియో వైరల్

Kamalaharris

Kamalaharris

అమెరికా మాజీ ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ డ్యాన్స్‌తో అదరగొట్టారు. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఓటమి తర్వాత బహిరంగంగా ఆమె డ్యాన్స్‌తో అదరగొట్టారు. ‘బూట్స్ ఆన్ ది గ్రౌండ్’ అనే పాటకు డ్యాన్స్ చేశారు. శాని ఫ్రాన్సిస్కోలో జరిగిన ఎమర్జ్ అమెరికా 20వ వార్షికోత్సవ వేడుకలో కంటెంట్ క్రియేటర్ కెన్నెత్ వాల్డెన్‌తో కలిసి ఆమె డ్యాన్స్ చేశారు. ప్రస్తుతం ఆమె చేసిన డ్యాన్స్ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. నృత్యం అందిరిని ఆకట్టుకుంటోంది.

ఇది కూడా చదవండి: Jo Sharma :తెలుగు హీరోయిన్ కు అమెరికా ప్రతినిధిగా ‘వేవ్స్ సమ్మిట్ 2025’ ఆహ్వానం

2024లో జరిగిన అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్ చేతిలో కమలా హారిస్ ఓడిపోయారు. అప్పటి నుంచి పెద్దగా ఆమె కనిపించడం లేదు. తాజాగా ఒక పబ్లిక్ వేడుకలో డ్యాన్స్‌తో అందరినీ ఆకట్టుకున్నారు. ఇక తన ప్రసంగంలో ట్రంప్ పరిపాలనపై విమర్శలు గుప్పించారు. సుంకాలు, వలసలపై తీవ్ర ఆరోపణలు చేశారు. దేశం ప్రమాదకరమైన దిశలో వెళ్తోందని హెచ్చరించారు.

ఇది కూడా చదవండి: Tejashwi Yadav: కుల గణనపై ప్రధాని మోడీకి తేజస్వి యాదవ్ లేఖ

Exit mobile version