NTV Telugu Site icon

Justin Trudeau: భారత్‌తో దౌత్య వివాదాల మధ్య కెనడా ప్రధాని ‘నవరాత్రి శుభాకాంక్షలు’

Canada Pm

Canada Pm

Justin Trudeau: ఖలిస్తాన్ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్య ఇండియా-కెనడాల మధ్య తీవ్ర దౌత్యవివాదానికి కారణమైంది. కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో ఈ హత్యలో భారత ఏజెంట్ల ప్రమేయం ఉందని ఆరోపించడంతో పాటు సీనియర్ భారత దౌత్యవేత్తను కెనడా నుంచి బహిష్కరించడం వివాదాస్సదమైంది. భారత్ కూడా సీనియర్ కెనడా దౌత్యవేత్తను బహిష్కరించింది. దీంతో పాటు పలువురు కెనడా దౌత్యవేత్తలను ఇండియా నుంచి తగ్గించుకోవాలని ఆదేశించింది.

ఇదిలా ఉంటే తాజాగా కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో దేశంలోని హిందూ సమాజానికి ‘‘నవరాత్రి శుభాకాంక్షలు’’ తెలిపారు. కెనడా ప్రభుత్వం ఖలిస్తాన్ ఉగ్రవాదికి మద్దతుగా నిలవడం, పలువురు రాడికల్ సిక్ సంస్థలు హిందువులను టార్గెట్ చేస్తూ బెదిరించంతో కెనడాలోని హిందూ కమ్యూనిటీ ఆందోళన వ్యక్తం చేసిన నేపథ్యంలో ట్రూడో శుభాకాంక్షలు తెలిపారు.

Read Also: Thaman: నా కడుపు నింపిన మనిషి బాలకృష్ణ..

‘‘నవరాత్రి శుభాకాంక్షలు! హిందూ సమాజంలోని సభ్యులకు మరియు ఈ పండుగను జరుపుకుంటున్న వారందరికీ నేను నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను’’ అంటూ ఎక్స్(ట్విట్టర్)లో ట్రూడో పోస్ట్ చేశారు.

ఈ ఏడాది జూన్ నెలలో ఖలిస్తాన్ ఉగ్రవాది, ఖలిస్తాన్ టైగర్ ఫోర్స్(కేటీఎఫ్) సంస్థ చీఫ్ హర్దీప్ సింగ్ నిజ్జర్ ని కెనడాలోని సర్రే ప్రాంతంలో గురుద్వారా ముందు గుర్తుతెలియని వ్యక్తులు కాల్చి చంపారు. అయితే ఈ హత్యలో భారత ప్రయేయం ఉందని కెనడా ప్రధాని ఆరోపించారు. అయితే దీనికి భారత్ ధీటుగానే స్పందించింది. కెనడా ఆరోపణలు అసంబద్ధ, రాజకీయ ప్రేరేపిత వ్యాఖ్యలని, కెనడా ఉగ్రవాదులకు స్వర్గధామంగా మారిందని భారత విదేశాంగ ధ్వజమెత్తింది.