Site icon NTV Telugu

Qatar: ఖతార్‌లో వరసగా జర్నలిస్టుల మరణాలు.. ప్రభుత్వ ప్రమేయంపై అనుమానాలు

Fifa World Cup, Qatar

Fifa World Cup, Qatar

Journalist Khalid al-Misslam Dies During World Cup In Qatar: ఫిపా ప్రపంచకప్ 2022కు ఖతార్ ఆతిథ్యం ఇస్తోంది. అయితే అక్కడి వచ్చే ప్రపంచ పుట్ బాల్ అభిమానులు మాత్రం తమ చట్టాలను ఖచ్చితంగా పాటించాలని హెచ్చరించింది. వస్త్రధారణ, స్వలింగ సంపర్కం వంటి వాటిపై నిక్కచ్చిగా వ్యవహరిస్తోంది. ఇదిలా ఉంటే స్వలింగ సంపర్కులకు మద్దతు తెలిపే విధంగా ఎలాంటి చర్యలు చేపట్టినా.. వారిని వెంటనే జైళ్లలో వేస్తోంది.

ఇదిలా ఉంటే ప్రస్తుతం ఖతార్ లో వరసగా ఇద్దరు జర్నలిస్టులు మరణించారు. అసలు ఖతార్ లో ఏం జరుగుతోందనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ప్రపంచ కప్ న్యూస్ కవర్ చేస్తున్న జర్నలిస్ట్ ఖలీద్ అల్ మిస్లామ్ మరణించారు. రోజుల వ్యవధిలో ఇది రెండో జర్నలిస్టు మరణం. అంతకు ముందు అమెరికా జర్నలిస్టు గ్రాంట్ వాల్ అర్జెంటీనా, నెదర్లాండ్స్ మ్యాచ్ కవర్ చేస్తున్న సమయలో కుప్పకూలి మరణించారు. ఈయన చనిపోయిన తర్వాత 48 గంటల్లోనే ఖలీద్ అల్ మిస్లామ్ మరణించారు.

Read Also: India-China Border Clash: చైనా బలహీనతలను భారత్ గుర్తించింది.. మరో యుద్ధం తప్పదు.. చైనా నెటిజన్ల స్పందన

అంతకుముందు స్వలింగ సంపర్కులు, LGBTQ కమ్యూనిటీకి మద్దతుగా రెయిన్‌బో టీ-షర్టు ధరించాడు గ్రాంట్ వాల్. ఈయన మరణించిన తర్వాత మరో ఘటన జరిగింది. ఖలీద్ ఆదివారం మరణించాడు. అయితే ఆయన మరణానికి సంబంధించి ఎలాంటి వివరాలు వెల్లడికాలేదు. ఫిఫా మ్యాచులు కవర్ చేస్తున్న సమయంలో ఖలీద్ మరనించినట్లు ఖతార్ పేర్కొంది. అయితే వరసగా ఇలా మరణాలు చోటు చేసుకోవడంపై పలువురు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఈ మరణాల్లో ఖతార్ ప్రభుత్వ ప్రమేయం ఉన్నట్లు అనుమానిస్తున్నారు.

అమెరికన్ జర్నలిస్ట్ గ్రాంట్ వాల్ మరణంలో ఖతార్ ప్రభుత్వ ప్రమేయం ఉన్నట్లు అతని సోదరుడు ఎరిక్ ఆరోపించారు. స్వలింగ సంపర్కులకు మద్దతుగా రెయిన్ బో టీ షర్టు ధరించినందుకు ఖతార్ ప్రభుత్వం గ్రాంట్ వాల్ ను కొంతకాలం నిర్భంధించింది. కాగా ఖతార్ చట్టాల ప్రకారం స్వలింగ సంపర్కం అనేది అక్కడ తీవ్రమైన నేరం.

Exit mobile version