NTV Telugu Site icon

Naomi Biden: జో బిడెన్ మనవరాలి వివాహం.. వైట్‌హౌజ్‌లో జరుగుతున్న ఎన్నో పెళ్లో తెలుసా..?

Joe Biden Grandaughter Marriage

Joe Biden Grandaughter Marriage

Joe Biden’s granddaughter Naomi to get married at White House: అమెరికా అధ్యక్షడు జో బిడెన్ మనవరాలు వివాహం చేసుకోనున్నారు. ఆయన మనవరాలు నోమి బిడెన్ వివాహం వైట్‌హౌస్‌లో శనివారం జరగనుంది. వైట్‌హౌస్‌లో ఇప్పటి వరకు 18 మంది వివాహాలు జరిగియి. ఎక్కువగా అధ్యక్షుల కుమార్తెల వివాహాలే జరిగాయి. ప్రస్తుతం జరగనున్న నోమి బిడెన్ వివాహం 19వది. తొలిసారిగా ఓ అధ్యక్షుడి మనవరాలి వివాహం వైట్‌హౌస్‌లో జరగనుంది. వైట్‌హౌస్‌లో మొత్తం 18 వివాహాలు జరిగితే ఇందులో తొమ్మిది ప్రెసిడెంట్ కూతుళ్లవే జరిగాయి. చివరిసారిగా 1971లో అప్పటి ప్రెసిడెంట్ రిచర్డ్ నిక్సన్ కుమార్తె వివాహం అంతకుముందు 1967లో లిండన్ బి. జాన్సన్ కుమర్తె వివాహాలు జరిగాయి.

Read Also: Gyanvapi case: “శివలింగం” పూజా హక్కులపై ఈ రోజు వారణాసి కోర్టు తీర్పు..

28 ఏళ్ల నోమి బిడెన్, తన కన్నా చిన్నవాడైన 25 ఏళ్ల పీటల్ నీల్ తో నాలుగేళ్లుగా సహజీవనం చేస్తోంది. పెన్సిల్వేనియా విశ్వవిద్యాలయం నుంచి పీటర్ నీల్ న్యాయశాస్త్రం నుంచి పట్టా పొందాడు. వీరిద్దరి వివాహం వైట్‌హౌస్‌లోని సౌత్ లాన్ లో జరగనుంది. ప్రెసిడెంట్ కొడుకు హంటర్ బిడెన్ కుమర్తెనే నోమి బిడెన్. నోమి కూడా న్యాయవాద వృత్తిలో ఉన్నారు.

న్యూయార్క్ లో కామన్ ఫ్రెండ్స్ ద్వారా నాలుగేళ్ల క్రితం కలుసుకున్న వీరిద్దరు అప్పటి నుంచి కలిసి ఉంటున్నారు. ప్రస్తుతం వీరిద్దరు వాషింగ్టన్ లో కలిసి ఉంటున్నారు. అమెరికా ఫస్ట్ లేడీ జిల్ బిడెన్ మాట్లాడుతూ.. తన మనవరాలిని వధువుగా చూసేందుకు వేచి ఉండలేనని.. ఆమె తన వివాహాన్ని ప్లాన్ చేసుకుంది.. ఆమె చాలా అందంగా ఉందంటూ ఆనందాన్ని వ్యక్తం చేసింది.

Show comments