NTV Telugu Site icon

Joe Biden: కోవిడ్ నుంచి కోలుకున్న అమెరికా అధ్యక్షుడు

Joe Biden

Joe Biden

Joe Biden Tests Negative For Covid: అమెరికా అధ్యక్షుడు కోవిడ్ నుంచి కోలుకున్నారు. ఇటీవల ఆయన కోవిడ్ బారిన పడి ఐసోలేషన్ లో ఉన్నాడు. జూలై 20 నుంచి తొలిసారిగా ఇప్పుడే బయటకు వచ్చాడు. తాజాగా ఆదివారం చేసిన పరీక్షల్లో ఆయనకు కోవిడ్ నెగిటివ్ ఫలితం వచ్చింది. వరసగా రెండు రోజుల పాటు చేసిన కరోనా పరీక్షల్లో నెగిటివ్ రావడంతో ఆయన ఐసోలేషన్ నుంచి బయటకు వచ్చారు. జూలై 20న జో బైడెన్ కోవిడ్ బారిన పడ్డారు. ఇదిలా ఉంటే జూలై 30 మరోసారి కోవిడ్ పరీక్ష చేయగా.. పాజిటివ్ వచ్చింది. దీంతో కోవిడ్ తిరగబెట్టిందని వైద్యులు ప్రకటించారు. దీంతో మళ్లీ బైడెన్ ఐసోలేషన్ కే పరిమితం కావాల్సి వచ్చింది.

Read Also: Indian Coast Guard: భారత జలాల్లోకి వచ్చిన పాకిస్తాన్ యుద్ధనౌక.. తరిమేసిన ఇండియన్ కోస్ట్ గార్డ్స్

గతంలో కూడా జో బైడెన్ కోవిడ్ బారిన పడ్డారు. కోవిడ్ రాకుండా ఫైజర్ వ్యాక్సిన్ తీసుకున్నారు. దీంతో పాటు ప్రికాషనరీ డోస్ తీసుకున్నా కూడా ఇటీవల జో బైడెన్ కు కరోనా సోకింది. తాజాగా ఆయన కోలుకుని తన విధుల్లో చేరారు. ఇటీవల కాలంలో వైట్ హౌజ్ లోని పలువురు అధికారులు వరసగా కోవిడ్ బారిన పడ్డారు. ఇక కోవిడ్ బారి నుంచి బయటపడటంతో బైడెన్ పాలనపై దృష్టి పెట్టనున్నారు. ఆదివారం సెనెట్ లో వాతావరణం, ఆరోగ్య సంరక్షణ బిల్లుపై చర్చించే అవకాశం ఉంది. సోమవారం కెంటకీ రాష్ట్రంలో పర్యటించే అవకాశం ఉంది. ఇటీవల భారీ వర్షాలు, వరదలతో కెంటకీ రాష్ట్రం నాశనం అయింది. అక్కడి పరిస్థితిని తెలుసుకునేందుకు జో బైడెన్ వెల్లనున్నారు.