NTV Telugu Site icon

Joe Biden: జో బైడెన్ మిస్సింగ్.. ఎక్కడంటే..!

Joebidenmissing

Joebidenmissing

జో బైడెన్.. అమెరికా మాజీ అధ్యక్షుడు. మూడు రోజుల క్రితమే మాజీ అయ్యారు. దాదాపు నాలుగేళ్లు అగ్ర రాజ్యాన్ని పరిపాలించిన అధ్యక్షుడు. ఈ విషయం ప్రపంచమంతటికీ తెలుసు. అలాంటిది గూగుల్ తల్లి మాత్రం మరిచిపోయింది. గూగుల్‌లో బైడెన్ పేరు సర్చ్ చేయగా నేమ్ మిస్ అయింది. ఓ అగ్ర రాజ్యాన్ని పాలించిన నాయకుడిని గూగుల్ గుర్తించలేకపోవడం నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ అంశం చర్చనీయాంశమవుతోంది.

జో బైడెన్.. 2021 నుంచి 2025 వరకు అమెరికా అధ్యక్షుడిగా పని చేశారు. జనవరి 20న మాజీ అయ్యారు. ఇంత వరకు బాగానే ఉంది. తాజాగా నెటిజన్లు.. గూగుల్‌లో అమెరికా అధ్యక్షుల లిస్టు సర్చ్ చేస్తుండగా బైడెన్ పేరు మిస్ అయింది. 2009-2017 వరకు బరాక్ ఒబామా రెండు సార్లు అమెరికాను పాలించినట్లుగా చూపిస్తోంది. అనంతరం 2017-2021 వరకు ట్రంప్ పాలించినట్లుగా కూడా చూపిస్తోంది. 2021 నుంచి 2025 వరకు అగ్ర రాజ్యాన్ని ఎవరు పాలించారోనన్న విషయం మాత్రం గూగుల్ చూపించలేకపోతుంది. ‘‘లిస్ట్ ఆఫ్ యూఎస్ ప్రెసిడెంట్ ఇన్ ఆర్డర్’’ నుంచి బైడెన్ తప్పిపోయారు. ఆ కాలాన్ని ఖాళీగా చూపిస్తున్నట్లుగా పలువురు నెటిజన్లు సోషల్ మీడియా వేదికగా సమస్యను లేవనెత్తారు. అధ్యక్షుల జాబితాలో జో బైడెన్ తప్పిపోయారంటూ పేర్కొన్నారు. 2021 నుంచి 2025 వరకు పాలించిన అమెరికా అధ్యక్షుడు ఎవరంటూ నెటిజన్లు ప్రశ్నిస్తు్న్నారు. ఈ అంశంపై గూగుల్ సంస్థ ఇంకా స్పందించలేదు. దీనిపై గూగుల్ ఏం క్లారిటీ ఇస్తుందో చూడాలి.

ఈనెల 20న అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ ప్రమాణస్వీకారం చేశారు. రెండోసారి అమెరికా అధ్యక్షుడిగా ప్రమాణం చేశారు. అమెరికాకు 47వ అధ్యక్షుడిగా ట్రంప్ బాధ్యతలు స్వీకరించారు. బాధ్యతలు స్వీకరించాక ట్రంప్ అనేక కీలకమైన నిర్ణయాలు తీసుకున్నారు.