Joe Biden: జో బైడెన్ మిస్సింగ్.. ఎక్కడంటే..!
- అమెరికా మాజీ అధ్యక్షుడు జో బైడెన్ మిస్సింగ్
- లిస్ట్ ఆఫ్ యూఎస్ ప్రెసిడెంట్ ఇన్ ఆర్డర్ నుంచి మిస్
- సోషల్ మీడియా వేదికగా నెటిజన్లు ఆశ్చర్యం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
జో బైడెన్.. అమెరికా మాజీ అధ్యక్షుడు. మూడు రోజుల క్రితమే మాజీ అయ్యారు. దాదాపు నాలుగేళ్లు అగ్ర రాజ్యాన్ని పరిపాలించిన అధ్యక్షుడు. ఈ విషయం ప్రపంచమంతటికీ తెలుసు. అలాంటిది గూగుల్ తల్లి మాత్రం మరిచిపోయింది. గూగుల్‌లో బైడెన్ పేరు సర్చ్ చేయగా నేమ్ మిస్ అయింది. ఓ అగ్ర రాజ్యాన్ని పాలించిన నాయకుడిని గూగుల్ గుర్తించలేకపోవడం నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ అంశం చర్చనీయాంశమవుతోంది.
జో బైడెన్.. 2021 నుంచి 2025 వరకు అమెరికా అధ్యక్షుడిగా పని చేశారు. జనవరి 20న మాజీ అయ్యారు. ఇంత వరకు బాగానే ఉంది. తాజాగా నెటిజన్లు.. గూగుల్‌లో అమెరికా అధ్యక్షుల లిస్టు సర్చ్ చేస్తుండగా బైడెన్ పేరు మిస్ అయింది. 2009-2017 వరకు బరాక్ ఒబామా రెండు సార్లు అమెరికాను పాలించినట్లుగా చూపిస్తోంది. అనంతరం 2017-2021 వరకు ట్రంప్ పాలించినట్లుగా కూడా చూపిస్తోంది. 2021 నుంచి 2025 వరకు అగ్ర రాజ్యాన్ని ఎవరు పాలించారోనన్న విషయం మాత్రం గూగుల్ చూపించలేకపోతుంది. ‘‘లిస్ట్ ఆఫ్ యూఎస్ ప్రెసిడెంట్ ఇన్ ఆర్డర్’’ నుంచి బైడెన్ తప్పిపోయారు. ఆ కాలాన్ని ఖాళీగా చూపిస్తున్నట్లుగా పలువురు నెటిజన్లు సోషల్ మీడియా వేదికగా సమస్యను లేవనెత్తారు. అధ్యక్షుల జాబితాలో జో బైడెన్ తప్పిపోయారంటూ పేర్కొన్నారు. 2021 నుంచి 2025 వరకు పాలించిన అమెరికా అధ్యక్షుడు ఎవరంటూ నెటిజన్లు ప్రశ్నిస్తు్న్నారు. ఈ అంశంపై గూగుల్ సంస్థ ఇంకా స్పందించలేదు. దీనిపై గూగుల్ ఏం క్లారిటీ ఇస్తుందో చూడాలి.
Also Read
- Bangladesh: షేక్ హసీనాకు అధ్యక్షుడి పిలుపు.. బంగ్లాదేశ్‌లో రాజకీయ కల్లోలం..
- Pakistan: సౌదీకి మేమున్నాం.. ఇరాన్‌కు పాకిస్తాన్ ప్రధాని వార్నింగ్..
- Trump: మరో దేశంపై సైనిక దాడికి ట్రంప్ ఏర్పాట్లు?.. ఏం జరగబోతుంది?
- US Defense Budget: ప్రపంచాన్ని వణికిస్తున్న అమెరికా డిఫెన్స్ బడ్జెట్.. షాక్‌కు గురి చేస్తున్న లక్షల కోట్లు!
ఈనెల 20న అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ ప్రమాణస్వీకారం చేశారు. రెండోసారి అమెరికా అధ్యక్షుడిగా ప్రమాణం చేశారు. అమెరికాకు 47వ అధ్యక్షుడిగా ట్రంప్ బాధ్యతలు స్వీకరించారు. బాధ్యతలు స్వీకరించాక ట్రంప్ అనేక కీలకమైన నిర్ణయాలు తీసుకున్నారు.
I rarely use this app, but just because others are talking about this on another app – thought to bring it to this side too.
When people are googling who was the US president during the Biden years, the answer doesn’t match. Also, when you google “US presidents in order” 🤔 pic.twitter.com/Mg4RkLpELY
— Carolina (@Mambos_mom) January 23, 2025
తాజావార్తలు
-
Sonam Wangchuk: ప్రభుత్వ హామీతో.. నిరాహార దీక్షను విరమించిన సోనం వాంగ్‌చుక్
-
Astrology: జూలై 24 శుక్రవారం దినఫలాలు.. ఏ రాశివారు.. ఏ పరిహారం చెల్లించాలంటే..?
-
CM Revanth Reddy : విద్యార్థుల యూనిఫాంల నాణ్యతపై రాజీపడేది లేదు
-
OTR : విశ్వేశ్వర్ రెడ్డి ఒక్క మాటతో వైసీపీ ఇరుక్కుందా?
-
Covid 19: కోవిడ్‌పై కేంద్రం క్లారిటీ.. భయపడాల్సిన అవసరం లేదట..!
ట్రెండింగ్
-
Home Tips : ఎండిపోయిన పాత కొబ్బరిని పడేస్తున్నారా? ఇంట్లోనే ప్యూర్ కొబ్బరి నూనె..!
-
SBI నుంచి రూ.15 లక్షల వరకు స్కాలర్షిప్.. విద్యార్థులు దరఖాస్తు ఎలా చేసుకోవాలంటే.?
-
Punya Kshetra Yatra: భక్తులకు శుభవార్త.. అయోధ్య, కాశీ, పూరీ, ప్రయాగ్‌రాజ్.. పుణ్యక్షేత్ర యాత్ర స్పెషల్ రైలు.. వివరాలు ఇదిగో.!
-
Pachimirapakaya Pachadi: తిన్నకొద్దీ తినాలనిపించే “పచ్చిమిరపకాయ రోటి పచ్చడి” చేసేయండి ఇలా.!
-
IND vs ZIM 1st T20: వైభవ్ సూర్యవంశీకి షాక్.. కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ దోస్తుకు ఛాన్స్?