Joe Biden: హమాస్ చీఫ్ సిన్వర్ మృతితో గాజా యుద్ధం ముగింపునకు మార్గం సుగమమైంది..
- ఇజ్రాయెల్ దాడుల్లో హమాస్ మిలిటెంట్ గ్రూపు చీఫ్ యాహ్యా సిన్వర్ మృతి..
- సిన్వర్ మృతిపై అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ సంచలన వ్యాఖ్యలు..
- యహ్యా సిన్వర్ అంతంతో గాజా యుద్ధం ముగింపునకు లైన్ క్లియర్ అయింది: జో బైడెన్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Joe Biden: అక్టోబరు 7 దాడుల సూత్రధారి, హమాస్ మిలిటెంట్ గ్రూపు చీఫ్ యాహ్యా సిన్వర్‌ను ఇజ్రాయెల్ సైన్యం చంపేసింది. ఈ సందర్భంగా ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు స్పందిస్తూ.. సిన్వర్‌ను హతమార్చి, లెక్కను సరి చేశామన్నారు. తమ బంధీలను సురక్షితంగా తరలించే వరకు యుద్ధం కొనసాగుతుందని వెల్లడించారు. అలాగే, విదేశాంగ మంత్రి కాంట్జ్ మాట్లాడుతూ.. ఇది ఇజ్రాయెల్‌కు సైనికంగా, నైతికంగా ఘన విజయం అని చెప్పుకొచ్చారు. ఇరాన్ నేతృత్వంలో రాడికల్ ఇస్లాం దుష్టశక్తులకు వ్యతిరేకంగా స్వేచ్ఛా ప్రపంచం సాధించిన విజయం అని వెల్లడించారు. యహ్యా సిన్వర్ మృతిలో తక్షణ కాల్పుల విరమణకు.. బందీల విడుదలకు మార్గం క్లియర్ అవుతుందని కాంట్జ్ పేర్కొన్నారు.
Read Also: Prashant Varma : జై హనుమాన్ ను వదలుకున్న స్టార్ హీరో..!
Also Read
- Smit Machchhar: ఆ టైమ్‌లో "హనుమాన్ చాలీసా" పఠించాను.. ఆ దేవుడే నన్ను కాపాడాడు..
- Shoaib Malik Fourth Marriage Rumours: 44 ఏళ్ల షోయబ్ మాలిక్ నాలుగో పెళ్లి వార్తలు..! నిజమెంత?
- Putin Praises PM Modi: ప్రధాని మోడీపై పుతిన్ ప్రశంసలు.. ఉక్రెయిన్ సంక్షోభంపై పుతిన్ కీలక వ్యాఖ్యలు
- US Iran Tensions: ఇరాన్‌పై మరోసారి దాడికి ట్రంప్ బిగ్ ప్లాన్.. మిడిల్ ఈస్ట్‌కు 9,000 మంది సైనికుల తరలింపు
అయితే, హమాస్ చీఫ్ యహ్యా సిన్వర్ మృతిపై అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. హమాస్ అగ్రనేత సిన్వర్‌ను ఇజ్రాయెల్ దళాలు మట్టుబెట్టడం యావత్ ప్రపంచానికి శుభ సూచకం అన్నారు. ఈ ఘటన హమాస్ చెరలో ఉన్న బందీల రిలీజ్ కు.. ఏడాదిగా కొనసాగుతున్న గాజా యుద్ధం ముగింపునకు దోహదపడుతుంది అని వ్యాఖ్యానించారు.
Read Also: RRR Movie : హిస్టారికల్ రన్.. ఆ థియేటర్లో 21 నెలలు ఆడిన’‘RRR”
ఇక, దక్షిణ గాజాలో బుధవారం ముగ్గురు హమాస్ మిలిటెంట్లను ఇజ్రాయెల్ ఐడీఎఫ్ హతమార్చింది. ఇందులో ఓ వ్యక్తికి సిన్వర్ పోలికలు ఉన్నాయని గుర్తించి ఇజ్రాయెల్ సైన్యం.. డీఎన్ఏ, దంత నమూనాలను ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపి హమాస్ నేత మరణాన్ని అధికారికంగా ధ్రువీకరించింది. అయితే, గాజా యుద్ధానికి కారణమైన అక్టోబరు 7 దాడుల సూత్రధారి సిన్వరేనని తొలి నుంచి ఇజ్రాయెల్ గట్టిగా నమ్ముతుంది. గతేడాది ఇజ్రాయెల్ సరిహద్దులపై హమాస్ జరిపిన దాడిలో 1200 మంది చనిపోయారు. మరో 250 మందిని బందీలుగా గాజాకు తీసుకెళ్లారు. ఇంకా హమాస్ దగ్గర 100 మంది బందీలుగా ఉన్నారు.
తాజావార్తలు
-
Supreme Court: “ఇక బండి సీజ్”.. పెండింగ్ చలాన్లపై సుప్రీంకోర్టు సంచలన తీర్పు..
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Aprilia SXR GT 125: Aprilia నుంచి కొత్త మ్యాక్సీ స్కూటర్లు.. SXR GT 125, SXR GT 175 విడుదల.. ధరలు ఇవే!
-
Pawan Kalyan: కరువు నేల నుంచి ప్రపంచ స్థాయి ఉద్యానవన కేంద్రంగా.. పవన్ కల్యాణ్ కీలక వ్యాఖ్యలు
-
KTR: కళ్యాణలక్ష్మికి 12 ఏళ్ళు..! ఈ పథకాన్ని రద్దు చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయ్..
ట్రెండింగ్
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!
-
Asian Games 2026: శ్రీలంకపై భారత్ భారీ విజయం.. బంగారు పతకం కోసం భారత్, పాక్ పోరు.!
-
Asian Games 2026: వైభవ్ మెరుపులు.. ఇషాన్ ఊచకోత..! శ్రీలంక టార్గెట్ ఎంతంటే.?