NTV Telugu Site icon

Joe Biden: హమాస్ చీఫ్ సిన్వర్‌ మృతితో గాజా యుద్ధం ముగింపునకు మార్గం సుగమమైంది..

Baiden

Baiden

Joe Biden: అక్టోబరు 7 దాడుల సూత్రధారి, హమాస్‌ మిలిటెంట్‌ గ్రూపు చీఫ్ యాహ్యా సిన్వర్‌ను ఇ​జ్రాయెల్‌ సైన్యం చంపేసింది. ఈ సందర్భంగా ఇజ్రాయెల్‌ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు స్పందిస్తూ.. సిన్వర్‌ను హతమార్చి, లెక్కను సరి చేశామన్నారు. తమ బంధీలను సురక్షితంగా తరలించే వరకు యుద్ధం కొనసాగుతుందని వెల్లడించారు. అలాగే, విదేశాంగ మంత్రి కాంట్జ్‌ మాట్లాడుతూ.. ఇది ఇజ్రాయెల్‌కు సైనికంగా, నైతికంగా ఘన విజయం అని చెప్పుకొచ్చారు. ఇరాన్‌ నేతృత్వంలో రాడికల్‌ ఇస్లాం దుష్టశక్తులకు వ్యతిరేకంగా స్వేచ్ఛా ప్రపంచం సాధించిన విజయం అని వెల్లడించారు. యహ్యా సిన్వర్‌ మృతిలో తక్షణ కాల్పుల విరమణకు.. బందీల విడుదలకు మార్గం క్లియర్ అవుతుందని కాంట్జ్ పేర్కొన్నారు.

Read Also: Prashant Varma : జై హనుమాన్ ను వదలుకున్న స్టార్ హీరో..!

అయితే, హమాస్ చీఫ్ యహ్యా సిన్వర్‌ మృతిపై అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు. హమాస్‌ అ‍గ్రనేత సిన్వర్‌ను ఇజ్రాయెల్‌ దళాలు మట్టుబెట్టడం యావత్‌ ప్రపంచానికి శుభ సూచకం అన్నారు. ఈ ఘటన హమాస్‌ చెరలో ఉన్న బందీల రిలీజ్ కు.. ఏడాదిగా కొనసాగుతున్న గాజా యుద్ధం ముగింపునకు దోహదపడుతుంది అని వ్యాఖ్యానించారు.

Read Also: RRR Movie : హిస్టారికల్ రన్.. ఆ థియేటర్లో 21 నెలలు ఆడిన’‘RRR”

ఇక, దక్షిణ గాజాలో బుధవారం ముగ్గురు హమాస్‌ మిలిటెంట్లను ఇజ్రాయెల్‌ ఐడీఎఫ్ హతమార్చింది. ఇందులో ఓ వ్యక్తికి సిన్వర్‌ పోలికలు ఉన్నాయని గుర్తించి ఇజ్రాయెల్ సైన్యం.. డీఎన్‌ఏ, దంత నమూనాలను ఫోరెన్సిక్‌ ల్యాబ్‌కు పంపి హమాస్‌ నేత మరణాన్ని అధికారికంగా ధ్రువీకరించింది. అయితే, గాజా యుద్ధానికి కారణమైన అక్టోబరు 7 దాడుల సూత్రధారి సిన్వరేనని తొలి నుంచి ఇజ్రాయెల్‌ గట్టిగా నమ్ముతుంది. గతేడాది ఇజ్రాయెల్‌ సరిహద్దులపై హమాస్‌ జరిపిన దాడిలో 1200 మంది చనిపోయారు. మరో 250 మందిని బందీలుగా గాజాకు తీసుకెళ్లారు. ఇంకా హమాస్‌ దగ్గర 100 మంది బందీలుగా ఉన్నారు.