Site icon NTV Telugu

Trump-Jeo Biden: తొలిసారి ట్రంప్‌ను ప్రశంసించిన బైడెన్.. గాజా డీల్ అద్భుతం అంటూ పొగడ్తలు

Trumpjeo Biden

Trumpjeo Biden

గాజాలో శాంతి వాతావరణం నెలకొనడంతో ప్రపంచ వ్యాప్తంగా ట్రంప్‌పై ప్రశంసల వర్షం కురుస్తోంది. ఆయా దేశాధినేతలంతా ట్రంప్‌ను అభినందిస్తున్నారు. తాజాగా ఆ జాబితాలో అమెరికా మాజీ అధ్యక్షుడు జో బైడెన్ కూడా చేశారు. తొలిసారి ట్రంప్‌ను బైడెన్ అభినందించారు. ట్రంప్ తీసుకొచ్చిన 20 పాయింట్ల ప్రణాళికను బైడెన్ స్వాగతించారు. ఈ ఒప్పందం కుదిరేలా మార్గం సుగమం చేయడం మామూలు విషయం కాదని పేర్కొన్నారు. ఇజ్రాయెల్ బందీలు విడుదల కావడంపై బైడెన్ హర్షం వ్యక్తం చేశారు. అలాగే బిల్ క్లింటన్, హిల్లరీ క్లింటన్ కూడా ట్రంప్‌ను ప్రశంసించారు.

ఇది కూడా చదవండి: Hugs And Kisses: 738 రోజుల తర్వాత కలిసిన జంటలు.. బందీల వీడియోలు వైరల్

బందీలు ఊహించలేని నరకం అనుభవించారని.. చివరికి కుటుంబాలను, ప్రియమైనవారిని చేరుకున్నారని బైడెన్ తెలిపారు. గాజాలో అపారమైన నష్టాన్ని చూసిన తర్వాత తిరిగి పునర్నిర్మించుకునే అవకాశం లభించిందని స్పష్టం చేశారు. బందీలను ఇంటికి తీసుకురావడం మామూలు విషయం కాదని తెలిపారు. అలాగే పాలస్తీనా పౌరులకు కూడా ఉపశమనం లభించడం మంచి విషయం అన్నారు. ఈ సందర్భంగా ట్రంప్, అతని బృందాన్ని అభినందిస్తున్నట్లు బైడెన్ పేర్కొన్నారు. అమెరికా మద్దతుతో గాజా, ఇజ్రాయెల్‌లో శాంతి, గౌరవం, భద్రత లభిస్తుందని ఆశిస్తున్నట్లు తెలిపారు.

ఇది కూడా చదవండి: Trump-Meloni: మెలోని అందమైన అమ్మాయి.. అలాంటే అభ్యంతరం లేదు కదా? నవ్వులు పూయించిన ట్రంప్

సోమవారం హమాస్ 20 మంది బందీలను.. నాలుగు మృతదేహాలను అప్పగించింది. అలాగే 2 వేల మంది పాలస్తీనా ఖైదీలను ఇజ్రాయెల్ విడుదల చేసింది. ఇక ఈజిప్టు వేదికగా గాజా శాంతి ఒప్పందం జరిగింది. ఈ సదస్సుకు ట్రంప్ సహా ఆయా దేశాధినేతలంతా హాజరయ్యారు.

Exit mobile version