JD Vance: ఇరాన్ పొరబడుతోంది.. ఒప్పందం లెబనాన్‌కు వర్తించదు
- తాజా ఒప్పందం లెబనాన్‌కు వర్తించదు
- ఈ విషయంలో ఇరాన్ పొరబడుతోంది
- అందుకు అమెరికా అంగీకరించదన్న జేడీ వాన్స్
- శనివారం ఇస్లామాబాద్ వేదికగా జేడీ వాన్స్ బృందం చర్చలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఇరాన్-అమెరికా మధ్య రెండు వారాల పాటు కాల్పుల విరమణ ఒప్పందం జరిగినప్పటికీ ప్రస్తుతం పశ్చిమాసియాలో పరిస్థితులు ఉద్రిక్తంగానే ఉన్నాయి. తాజా ఒప్పందం లెబనాన్‌కు వర్తించకపోవడంతో ఇజ్రాయెల్ జరిపిన భీకర దాడుల్లో 254 మంది చనిపోయారు. దీంతో ఈ వ్యవహారాన్ని ఇరాన్ జీర్ణించుకోలేకపోతుంది. హార్ముజ్ జలసంధిపై మళ్లీ కఠిన ఆంక్షలు విధించింది.
అయితే ఈ వ్యవహారంపై అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ స్పందించారు. కాల్పుల విరమణ ఒప్పందం లెబనాన్ కోసం కాదని.. ఈ విషయంలో ఇరాన్ పొరబడుతోందని తెలిపారు. కాల్పుల విరమణ ఒప్పందం లెబనాన్‌కు వర్తిస్తుందనే దానికి అమెరికా అంగీకరించలేదని జేడీ వాన్స్ తేల్చి చెప్పారు. అయితే ఈ ఒప్పందంలో లెబనాన్ కూడా ఉందని టెహ్రాన్ ప్రతినిధులు భావించారని.. అయితే వాస్తవానికి అమెరికా దానికి అంగీకరించలేదన్నారు. ఇది ఒక సహేతుకమైన అపార్థం వల్ల జరిగిందని అనుకుంటున్నానని బుడాపెస్ట్‌లో విలేకరులతో జేడీ వాన్స్ అన్నారు.
Also Read
- Saudi: రియాద్ ఎయిర్‌పోర్టులో మరోసారి భారీ పేలుడు.. విమానాలు దారి మళ్లింపు
- Solar Storm: రేపు భూమిని తాకనున్న శక్తివంతమైన సౌర తుఫాను.. భారత్‌పై ప్రభావం ఎంత?
- Panama Earthquake: 7.7 తీవ్రతతో భారీ భూకంపం.. ఊగిపోయిన భవంతులు.!
- Netanyahu: ఆమె యూదు వ్యతిరేకి.. నవీ పిళ్లైకు నోబెల్ బహుమతి ఇవ్వడంపై నెతన్యాహు తీవ్ర వ్యాఖ్యలు
అయితే మధ్యవర్తిగా ఉన్న పాకిస్థాన్ వ్యాఖ్యలు అందుకు భిన్నంగా ఉన్నాయి. కాల్పుల విరమణ ఒప్పందంలో లెబనాన్ కూడా ఉందని ప్రధానమంత్రి షెహబాజ్ షరీఫ్ వ్యాఖ్యానించారు. జేడీ వాన్స్-షరీఫ్ వ్యాఖ్యలు పొంతన లేకుండా ఉన్నాయి.
ఇస్లామాబాద్‌కు జేడీ వాన్స్ బృందం
ఇదిలా ఉంటే ఇరాన్‌తో శాంతి చర్చల బృందానికి జేడీ వాన్స్ నాయకత్వం వహించనున్నారు. తొలి విడత చర్చలు ఏప్రిల్ 11న ఇస్లామాబాద్‌లో జరగనున్నాయి. ఇందుకోసం జేడీ వాన్స్ బృందాన్ని ట్రంప్ పాకిస్థాన్‌కు పంపిస్తున్నారు. అయితే తాజాగా లెబనాన్‌పై ఇజ్రాయెల్ దాడులు చేస్తున్న నేపథ్యంలో శాంతి చర్చలు ఎలా ముందుకు సాగుతాయన్నదానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.
తాజావార్తలు
-
Yogi Adityanath: ‘‘ఇద్దరం పోటీ చేద్దాం, అదృష్టాన్ని పరీక్షించుకుందాం’’.. అఖిలేష్‌కు యోగి సవాల్..
-
AP Govt: NTR వైద్య సేవలో అక్రమాలపై వేటు.. 203 ఆసుపత్రులకు రూ.34.39 కోట్ల జరిమానా..
-
Rekha Gupta: ఢిల్లీని బందీగా మార్చనివ్వం.. విపక్షాల కుట్రను తిప్పికొడతామన్న రేఖా గుప్తా
-
Virender Sehwag: ‘ఫస్ట్ బంతి నుంచే సిక్సర్లు’.. సూర్యవంశీకి సెహ్వాగ్ కీలక సూచనలు..
-
CM Revanth Reddy: ఎల్‌నినోతో పొంచి ఉన్న సంక్షోభం.. గ్రామస్థాయి నుంచి ప్రజలను అప్రమత్తం చేయాలి..
ట్రెండింగ్
-
Shai Hope: నా దగ్గర ఆ బ్యాట్స్ ఉన్నాయి.. అందుకే బంతి బౌండరీలు దాటుతోంది.. విండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
3D ఎఫెక్ట్‌తో మెకానికల్ లుక్.. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌తో భారత్‌లోకి Infinix GT 50 Pro..!
-
కొత్త అల్లాయ్ వీల్స్, అప్డేటెడ్ లుక్ తో Toyota Fortuner 2026 Leader ఎడిషన్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!