Site icon NTV Telugu

JD Vance – Erika Kirk: “నా భర్తను జేడీ వాన్స్‌లో చూస్తున్నా”.. ఉషా కాపురంలో ఎరికా కిర్క్ నిప్పులు పోస్తుందా..?

Jd Vance Erika Kirk

Jd Vance Erika Kirk

JD Vance Erika Kirk: అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ వ్యవహారం సంచలనంగా మారింది. ఈ వారం ప్రారంభంలో టర్నింగ్ పాయింట్ యూఎస్ఏ క్యాంపస్ ఈవెంట్‌లో జేడీ వాన్స్ మాట్లాడుతూ.. తన భార్య ఉషా వాన్స్ హిందూ మతం నుంచి క్రిస్టియానిటీని స్వీకరిస్తుందని చెప్పారు. ఈ వ్యాఖ్యలు భారతీయ అమెరికన్లలో తీవ్ర ఆగ్రహాన్ని నింపాయి. జేడీ వాన్స్ 2028 అధ్యక్ష ఎన్నికల కోసం ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. మరికొందరు, ఇటీవల హత్యకు గురైన చార్లీకిర్క్ భార్య ఎరికా కిర్క్‌తో ప్రేమలో ఉన్నారని అన్నారు. దీనికి , జేడీ వాన్స్ ఎరికా కిర్క్ కౌగిలించుకున్న ఫోటోను ఆధారంగా చూపిస్తున్నారు.

Read Also: DVV Entertainments : ప్రశాంత్ వర్మ అడ్వాన్స్’ల పంచాయితీ.. మాకేం సంబంధం లేదన్న డీవీవీ

ఇదిలా ఉంటే, తాజాగా ఎరికా కిర్క్ జేడీ వాన్స్ గురించి చేసిన వ్యాఖ్యలు ఈ వివాదాన్ని మరింత పెద్దదిగా చేసింది. ట్రంప్‌కు అత్యంత సన్నిహితుడైన చార్లీ కిర్క్ సెప్టెంబర్ నెలలో ఊటా యూనివర్సిటీలో హత్యకు గురయ్యాడు. ఆయన హత్య తర్వాత అతడి భార్య ఎరికా తన మొదటి బహిరంగం కార్యక్రమంలో మాట్లాడింది. భావోద్వేగంతో మాట్లాడుతూ.. ‘‘ నా భర్తను ఎవరూ ఎప్పటికీ భర్తీ చేయలేరు. కానీ జేడీ వాన్స్‌లో నా భర్త పోలికలు కనిపిస్తున్నాయి’’ అని ఎరికా చెప్పడం, ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షించింది.

వాన్స్ వేదికపైకి వచ్చినప్పుడు, ఎరికాను కౌగిలించడం వివాదాన్ని మరింత పెద్దది చేసింది. వీరిద్దరి కౌగిలించ చిత్రాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. దీంతో వీరిద్దరి మధ్య ఏదో నడుస్తుందని ఊహాగానాలు వ్యక్తమవుతున్నాయి. ఉషా సంసారంలో ఎరికా నిప్పులు పోస్తుందనే ప్రచారం జరుగుతోంది. ‘‘2026 నాటికి చార్లీ కిర్క్ భార్యను జేడీ వాన్స్ వివాహం చేసుకుంటాడని, ఉపాధ్యక్షుడిగా ఉండీ విడాకులు తీసుకున్న మొదటి వ్యక్తిగా నిలుస్తారు ’’ అని కామెంట్స్ చేస్తున్నారు.

Exit mobile version