అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చిన్నారులతో కలిసి సందడి చేశారు. వైట్‌హౌస్‌లో ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్, అమెరికా విదేశాంగ కార్యదర్శి మార్కో రూబియో పిల్లలతో కలిసి ట్రంప్ ఆడుకున్నారు. తాజాగా వారికి బహుమతులు కూడా ఇచ్చారు. గత నెలలో జరిగిన హాలిడే పార్టీలో ఇద్దరి నాయకుల పిల్లలతో ఆడుకుంటున్నప్పుడు ఒక్కొక్కరికి నాలుగు జతలు బూట్లు కొంటానని ట్రంప్ హామీ ఇచ్చారు. దీంతో వెంటనే జేడీ వాన్స్, రూబియోను పిల్లల షూ సైజలు ఎంతని అడిగి తెలుసుకున్నారు. తాజాగా పిల్లలందరికీ నాలుగు జతల బూట్లు అందించినట్లుగా ట్రంప్ తెలిపారు.
ది న్యూయార్క్ టైమ్స్‌లకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ట్రంప్ మాట్లాడుతూ.. జేడీ వాన్స్, రూబియో పిల్లలకు బూట్లు బహుమతిగా ఇచ్చినట్లు తెలిపారు. ఇక ఇంటర్వ్యూలో అనేక విషయాలు ప్రస్తావించారు. ‘‘నేను రియల్ ఎస్టేట్‌లో నిజంగా మంచివాడిని’’ అని చెబుతూ,, ‘‘బహుశా నేను రాజకీయాల్లో కంటే రియల్ ఎస్టేట్‌లో మెరుగ్గా ఉండవచ్చు.’’ అని వ్యాఖ్యానించారు. ఇక వెనిజులా ప్రస్తావన వచ్చినప్పుడు.. ‘‘నేను ప్రజాస్వామ్యానికి పెద్ద అభిమానిని.’’ అని పేర్కొన్నారు.
8 యుద్ధాలు ఆపాను..
భారత్-పాకిస్థాన్‌తో పాటు ప్రపంచ వ్యాప్తంగా ఎనిమిది యుద్ధాలు ఆపానని మళ్లీ ప్రస్తావించారు. అయినా కూడా తనకు నోబెల్ శాంతి బహుమతి రాలేదన్నారు. ఎన్నో ఏళ్లుగా దేశాల మధ్య ఉన్న వైర్యాన్ని పరిష్కరించానని.. కానీ ఏమీ చేయని ఒబామాకు మాత్రం నోబెల్ శాంతి బహుమతి ఇచ్చారని.. ఇది చాలా ఆశ్చర్యంగా ఉందని వ్యాఖ్యానించారు. ఇది మట్టుకు చాలా అద్భుతంగా ఉందన్నారు. అసలు ఒబామాకు నోబెల్ శాంతి బహుమతి ఎందుకిచ్చారో.. ఆ బహుమతి ఎందుకు పొందాడో అతనికి కూడా తెలియదని ట్రంప్ వ్యంగ్యస్త్రాలు సంధించారు.
ఇది కూడా చదవండి: Trump-Greenland: గ్రీన్‌లాండ్ కావాలంటే ఇలా చేయండి.. వైరల్‌గా మారిన ట్రంప్‌కు కొత్త ప్రతిపాదన
