ప్రియుడు కోసం అన్నీ వదిలేసిన రాజకుమారి.. పెళ్లి ముహూర్తం ఫిక్స్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రేమ.. ఎప్పుడు, ఎలా, ఎవరిపై పుడుతుందో చెప్పలేం.. దానికి కులం, గోత్రం, ఆస్తి, అంతస్తు, రూపం ఇలా ఏవీ అవసరం లేదని ఎన్నో ఘటనలు నిరూపించాయి.. కేవలం సినిమాల్లో మాత్రమే కాదు.. నిజజీవితంలో ఎందరో గొప్ప ప్రేమికులున్నారు.. ఏది కావాలంటే అది చిటికే వేసి తెప్పించుకునే స్థానంలో ఉన్న రాజకుమారులు సైతం సామాన్యుల ప్రేమలో పడిన ఘటనలు ఎన్నో.. జపాన్ రాకుమారి మాకో సైతం ఇదే కోవలోకి వస్తారు.. కోట్ల ఆస్తులను వద్దనుకుని.. ఓ సామాన్యుడి ప్రేమలు పడిపోయింది ఆ యువరాని.. న్యాయవాద విద్యార్థి కొమురో ఇప్పటికే పీకలలోతు ప్రేమలో మునిగితేలుతున్న ఆమె.. కుటుంబాన్ని సైతం ఒప్పించి.. తన ప్రేమను పెళ్లి పీఠల వరకు నడిపించారు.
మొత్తానికి మాకో-కొమురో వివాహానికి ముహూర్తం ఫిక్స్ చేశారు.. ఈ నెల 23వ తేదీన మాకోకు 30 ఏళ్లు నిండనుండగా.. 26వ తేదీన మాకో-కొమురో వివాహం రిజిస్టర్ చేయాలని నిర్ణయించారు.. ఇక, ఆమెకు కాబోయే అత్తింటివారి ప్రమేయంతో నెలకొన్న ఓ ఆర్థికపరమైన వివాదం వల్ల ఈ పెళ్లికి ప్రజామోదం పూర్తిగా లేనట్టుగా తెలుస్తోంది.. దీంతో వివాహ విందు, ఇతర లాంఛనాలేమీ లేకుండా.. చాలా సింపిల్‌గా రిజిస్టర్ మ్యారేజీకి పరిమితం అవుతారని చెబుతున్నారు. కాగా, న్యూయార్క్‌లో న్యాయవాద విద్యను అభ్యసిస్తున్న కొమురో వారం క్రితమే జపాన్‌కు తిరిగొచ్చారు. వివాహం తర్వాత కొత్త దంపతులు మీడియా సమావేశంలో మాట్లాడనున్నారట.. ఇక, న్యూయార్క్ వెళ్లి అక్కడే కాపురం పెట్టే యోచనలో ఉన్నారని తెలుస్తోంది.. అయితే, క్రిస్టియన్ విశ్వవిద్యాలయంలో చదువుకుంటున్న రోజుల్లో మాకో, కొమురో స్నేహితులయ్యారు.. అది క్రమంగా ప్రేమకు దారితీసింది.. ఆ తర్వాత 2017 సెప్టెంబర్‌లో పెళ్లి చేసుకోనున్నట్టు ప్రకటించారు.. కానీ, కొన్ని ఆర్థిక వివాదాల వల్ల పెళ్లి రద్దు అయ్యింది.. మొత్తంగా నాలుగేళ్ల తర్వాత మళ్లీ పెళ్లితో ఒక్కటికానున్నారు. మరోవైపు.. జపాన్ రాజకుటుంబానికి చెందిన యువతి, సామాన్య యువకుడిని పెళ్లిచేసుకుంటే అక్కడ నిబంధనల ప్రకారం రాకుమారి హోదాను వదిలిపెట్టాల్సి ఉంటుంది.. ఇక, సామాన్య వ్యక్తిని రాకుమారి పెళ్లాడితే రాజప్రాసాదం తరఫున ఆమెకు రూ.10 కోట్లు ఇస్తారు… కానీ, తన కుటుంబం ఇవ్వాలనుకున్న ఆ భారీ మొత్తాన్ని కూడా తీసుకునేందుకు తిరస్కరించారు మాకో..
Also Read
- Iran-Israel Tensions: మధ్యప్రాచ్యంలో మళ్లీ ఉద్రిక్తతలు.. ఇరాన్‌పై ఇజ్రాయెల్ ప్రతీకార దాడులు..
- Philippines Earthquake: ఫిలిప్పీన్స్‌లో 7.8 తీవ్రతతో భారీ భూకంపం.. సునామీ హెచ్చరిక జారీ
- Pakistan: చేతులెత్తేసిన పాకిస్థాన్ ప్రభుత్వం.. అవస్థలు పడుతున్న జనం! ఏం జరిగిందంటే..
- Russia: చమురు మార్కెట్‌ను భారత్ శాసిస్తుంది.. రష్యా సంచలన వ్యాఖ్యలు..
తాజావార్తలు
-
West Bengal: బెంగాల్ ‘‘పుష్ప’’ అరెస్ట్.. అభిషేక్ సన్నిహితుడి ఆటకట్టు..
-
Telangana Monsoon : తెలంగాణలోకి ఎంట్రీ ఇచ్చిన నైరుతి.. వర్షాల జోరు షురూ..!
-
Thaman : ‘ఎల్లమ్మ’ కథపై తమన్ షాకింగ్ కామెంట్స్..
-
Infosys: ఉద్యోగాల ఊస్ట్ సమయంలోనూ ఈ కంపెనీ ఏకంగా కోటి రూపాయల జీతాలు ఎలా ఇస్తోంది?
-
Mamata Banerjee: మమతకు బిగ్ షాక్.. ఇండియా కూటమి సమావేశం వేళ ఎంపీల తిరుగుబాటు..
ట్రెండింగ్
-
Manav Suthar Record: అరంగేట్ర స్పిన్నర్ మానవ్ సుతార్ అరుదైన రికార్డు.. ఈ శతాబ్దంలోనే ‘ఒకే ఒక్కడు’!
-
Harmanpreet Kaur: ‘నేను రిటైర్ అవ్వాలనుకుంటున్నారా?’.. రిపోర్టర్ కు ధోనీ స్టైల్లో మహిళా కెప్టెన్ కౌంటర్.!
-
Birth Rate: భారత్‌లో పడిపోతున్న జననాల రేటు.. విద్యావంతులు తక్కువ మంది పిల్లలను కనడమే కారణమా.?
-
Sugar Cravings Control : తీపి తినాలనే కోరికా..? ఈ చిట్కాలతో మీ స్వీట్ క్రేవింగ్స్‌కు చెక్ పెట్టండి.!
-
Monsoon Tips: వర్షాకాలంలో ప్రయాణమా..? ఈ చిన్న జాగ్రత్తలు ప్రాణాలను కాపాడతాయి.!