Japan: గత శతాబ్ధకాలంలో మారని చట్టాలను జపాన్ తాజాగా మార్చింది. ప్రపంచంలో అతితక్కువ సెక్స్ సమ్మతి వయసు ఉన్న జపాన్ ఇప్పుడు దాన్ని పెంచింది. సెక్స్ వయోపరిమితిని 13 ఏళ్ల నుంచి 16కి పెంచింది. దీంతో పాటు అత్యాచారాన్ని పునర్నిర్వచించింది. శుక్రవారం జపాన్ పార్లమెంట్ సెక్స్ క్రైమ్ చట్టాలను సవరించింది. మానవహక్కుల సంఘాలు ప్రభుత్వం చర్యలను స్వాగతించాయి. ప్రస్తుతం 16 ఏళ్ల కన్నా తక్కువ వయసులో ఏదైనా లైంగిక చర్యలకు పాల్పడితే దాన్ని అత్యాచారంగా పరిగణిస్తామని నిబంధనలు తీసుకువచ్చారు.
వివిధ దేశాల్లో సెక్స్ సమ్మతి వయసులు తేడాగా ఉంటాయి. అత్యంత తక్కువ వయసు జపాన్ దేశంలోనే ఉంది. భారత్ లో సమ్మతి వయసు 18 ఏళ్లు కాగా.. బ్రిటన్ లో 16, జర్మనీ, చైనాల్లో 14 ఏళ్లుగా ఉంది. పసిపిల్లలపై పెద్దలు చేసే లైంగిక హింస ఆమోదయోగ్యం కాదని సందేశాన్ని ఈ సంస్కరణలు పంపుతాయని మానవ హక్కుల సంఘాలు తెలిపాయి. జువైనల్ జంటల మధ్య వయసు తేడా 5 ఏళ్లు లేదా అంతకన్నా ఎక్కువగా ఉండీ.. ఇద్దరి వయసు 13 ఏళ్ల కన్నా ఎక్కువగా ఉంటే వారిపై విచారణ ఉండదని తాజా సంస్కరణల్లో మార్పు తీసుకువచ్చారు.
Read Also: China: చైనా సరికొత్త రికార్డు.. ఒకే మిషన్‌లో అంతరిక్షంలోకి 41 ఉపగ్రహాలు
1907 తర్వాత సుదీర్ఘ నిరీక్షణ తర్వాత జపాన్ పార్లమెంట్ కొత్త చట్టాలను తీసుకువచ్చింది. 2019లో మైనర్ లైంగిక నేరాల్లో నిర్దోషులుగా విడుదలయ్యే వారి సంఖ్య ఎక్కువగా ఉండటంతో జపాన్ లో విస్తృత నిరసనల చెలరేగాయి. పాత చట్టాల ప్రకారం.. హింస, బెదరింపు, అత్యాచారం సమయంలో బాధితులు, నిందితుడిని ఎదురించలేదని బలహీనంగా ఉన్నారని నిరూపించాల్సి వచ్చేది. అలా నిరూపిస్తేనే శిక్షలు పడేవి.
2014లో టోక్యోలో 15 ఏళ్ల అమ్మాయిపై ఓ యువకుడు బలవంతంగా రేప్ చేశాడు. సదుర అమ్మాయి ఎంత ప్రతిఘటించినా వదిలిపెట్టలేదు. దీనిపై బాధితురాలు కోర్టును ఆశ్రయించింది. తనపై అత్యాచారం జరిగనట్లు అన్ని సాక్ష్యాలను సమర్పించింది. అయితే అత్యాచారం సమయంలో బాధిత అమ్మాయి, దాన్ని అడ్డుకునేంత బలహీనరాలుగా లేదని కోర్టు అభిప్రాయపడటంతో పాటు సాధారణ సమ్మతి వయసు 13 ఏళ్ల కాగా.. అమ్మాయికి 15 ఏళ్లు ఉండటంతో సదరు బాలికను అమ్మాయిగా పరిగణించలేమని చెప్పింది. దీంతో నిందితుడికి శిక్ష పడలేదు.
కొత్త చట్టం ప్రకారం ఎవరైనా 16 ఏళ్లలోపు పిల్లలను లైంగిక ప్రయోజనాల కోసం ప్రలోభపెట్టడం, బెదిరింపులు లేదా డబ్బును ప్రలోభపెట్టడం చేస్తే ఒక ఏడాది జైలు శిక్ష లేదా రూ. 3 లక్షల జరిమానా, ఎవరైనా సరైన కారణం లేకుండా వ్యక్తిగత శరీర భాగాలు, లోపలి దుస్తులు లేదా అసభ్యకర చర్యలను రహస్యంగా చిత్రీకరించినందుకు నేరం రుజువైతే మూడేళ్ల వరకు జైలు శిక్ష లేదా రూ. 18 లక్షల వరకు జరిమానా విధించబడుతుంది.
