NTV Telugu Site icon

Japan Election: నేడు జపాన్ ప్రధాని పదవికి ఎన్నికలు.. బరిలో తొమ్మిది మంది అభ్యర్థులు

Japan

Japan

Japan Election: జపాన్ ప్రధాన మంత్రి పదవికి ఈ రోజు (శుక్రవారం) ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ ఎన్నికల బరిలో దాదాపు 9 మంది అభ్యర్థులు ఉన్నారు. వీరిలో చాలా మంది ప్రస్తుత మంత్రులతో పాటు మాజీ మంత్రులు కూడా ఉన్నారు. అయితే, కొత్త ప్రధానిగా ఎన్నికైన వారు తమ ఇమేజ్ ను వినియోగించుకుని.. 2025 అక్టోబర్ లో జరిగే దిగవసభ ఎన్నికల్లో విజయం సాధించబోతున్నామని ఇప్పటికే చాలాసార్లు చెప్పుకొచ్చారు.

Read Also: Indian Navy : సముద్రంలో పెరగనున్న భారత్ బలం.. నౌకాదళంలోకి 7 కొత్త యుద్ధనౌకలు, ఒక జలాంతర్గామి

ఇక, ఎల్‌డీపీకి 368 మంది ఎంపీల బలం ఉండగా.. ఎంపీకి ఒక ఓటు ఉండనుంది. 11 లక్షల ఎల్‌డీపీ సభ్యుల ప్రాధామ్యాలకు అనుగుణంగా మరో 368 ఓట్లను పోటీ పడుతున్న అభ్యర్థులకు కేటాయించనున్నారు. అంటే తొలిరౌండ్‌లో మొత్తం 736 ఓట్లు ఉండనున్నాయి. మొదటి రౌండ్‌లో 50 శాతానికి పైగా ఓట్లు సాధించిన వారిని విజేతగా నిలవనున్నారు. ఏకంగా తొమ్మిది మంది ఎన్నికల బరిలో ఉండటంతో తొలిరౌండ్‌లో ఏ ఒక్కరూ 50 శాతం ఓట్లను సాధించే ఛాన్స్ లేదని పరిశీలకులు తెలియజేస్తున్నారు. ఈ పరిస్థితుల్లో ఈరోజే రెండో రౌండ్‌ ఓటింగ్‌ కూడా జరగే అవకాశం ఉంది. మొదటిరౌండ్‌లో తొలి రెండు స్థానాల్లో నిలిచిన వారు సెకండ్ రౌండ్‌ ఓటింగ్‌కు అర్హత సాధించనున్నారు. ఈ రౌండ్లో 368 మంది ఎంపీలకు తోడు 47 మంది స్థానిక ప్రభుత్వాల ప్రతినిధులు ఓటు వేసేందుకు అర్హులు.

Read Also: Bruxism Teeth: నిద్రలో పళ్లు కొరుక్కోకుంటున్నారా.? ఇలా చేసి ఉపశమనం పొందండి!

కాగా, ఈ ఎన్నికల్లో మొత్తం 415 ఓట్లు ఉండనున్నాయి. తమ పరిధిలోని మెజారిటీ పార్టీ సభ్యులు ఎవరివైపు మొగ్గు చూపారో దానికి అనుగుణంగా స్థానిక ప్రభుత్వాల ప్రతినిధులు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నాయి. ఈ రేసులో ప్రధానంగా పోటీ ముగ్గురి మధ్యే ఉందని పలు పోల్‌ సర్వేలు చెప్పుకొచ్చాయి. మాజీ రక్షణ మంత్రి షిగెరూ ఇషిబా, మాజీ పర్యావరణ మంత్రి షిన్‌జిరో కొయిజుమీ, ఆర్థిక భద్రత మంత్రి తకైచీ సనయీలు ముందంజలో ఉన్నట్లు టాక్. మిగతా పోటీదారులుగా యోకో కమికావా, టారో కోనో, కత్సునోబు కటో, యోషిమాసా హయా, తకయుకి కొబయాషి, తొషిమిత్సు మొతెగి ఉన్నారు.