NTV Telugu Site icon

Japan: పిల్లల్ని ఎలా కనాలో నేర్పుతున్న నగరం.. ఎగబడి వెళ్తున్న జపాన్ ప్రజలు!

Nagi Town

Nagi Town

గత కొన్నేళ్లుగా జపాన్ లో జననాల రేటు భారీగా పడిపోతుంది. గత ఏడాది ఇది ఆల్ టైం కనిష్టానికి చేరుకుంది. మరికొన్నేళ్లు ఇదే పరిస్థితి కొనసాగితే.. జపాన్ తన ఉనికిని కోల్పోతుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. దాదాపు మూడు దశాబ్దాలుగా జపాన్ లో జననాల రేటు పడిపోతుంటే.. ఓ చిన్న పట్టణంలో మాత్రం ఇందుకు భిన్నంగా చేరుకుంటున్నారు.

Aslo Read : Li Qiang: చైనా కొత్త ప్రధానిగా లీ కియాంగ్.. జిన్‌పింగ్‌కు నమ్మినబంటుగా పేరు..

గత మూడు దశాబ్దాలుగా జపాన్ జనాభా మొదటి సారిగా 800,000 కంటే తక్కువ జననాలు నమోదయ్యాయి, అది అక్కడ మరణాల్లో దాదాపు సగం శాతం. మరికొన్నేళ్లు ఇదే పరిస్థితి కొనసాగితే తన ఉనికితో పాటుగా, జపాన్ అదృశ్యమవుతుందని ఆ దేశ ప్రధానమంత్రి సలహాదారు ఆందోళన వ్యక్తం చేశారు. ఇదిలా ఉంటే జపాన్ లోని చిన్న నగరంలో మాత్రం పరిస్థితులు ఇందుకు పూర్తి భిన్నంగా ఉన్నాయి. దేశంలోని జననాల రేటుతో పోల్చితే ఈ పట్టణంలో జననాల రేటు రెండింతలు ఎక్కువగా ఉంది. దీనికి ఈ పట్టణ ప్రజలు అనుసరిస్తున్న విధవానాలే కారణమని తెలుస్తుంది.

Aslo Read : CBI Ex JD Lakshmi Narayana: ఈడీ విచారణలో కవిత.. సీబీఐ మాజీ జేడీ కీలక వ్యాఖ్యలు

జపాన్ లోని నాగీ అనే చిన్న పట్టణంలో మాత్రం తమ జనాభాను అంతకంతకూ పెంచుకుంటూ పోతోంది. దాదాపు 6000 మంది జనాభా కలిగిన ఈ ప్రాంతంలో.. దేశంలో కంటే రెండు రెట్లు అధిక జననాల రేటు నమోదవుతోంది. ఇక్కడ ఏ ఇంట్లో చూసినా ఇద్దరు ముగ్గురు కంటే ఎక్కువ మంది పిల్లలు కనిపిస్తారు. దీంతో ఈ నగరంలో దేశ వ్యాప్తంగా వార్తల్లో నిలుస్తోంది. దేశ నలుమూలల నుంచే కాకుండా విదేశీ పర్యటకులను కూడా ఈ నాగీ పట్టణం విపరీతంగా ఆకర్షిస్తోంది. తమ కుటుంబాలను చూడటానికి వచ్చే పర్యాటకుల వద్ద నుంచి ప్రత్యేక రుసుం కూడా వసూలు చేస్తుందీ ఈ పట్టణం.

Aslo Read : Sabitha Indra Reddy : ప్రజలంతా కేసీఆర్‌ వెంటే ఉంటారు

నాగీ ఏరియాలో ముగ్గురు లేదా నలుగురు పిల్లలతో ఉన్న కుటుంబాన్ని చూడడం సర్వసాధారణం. తమ కుటుంబ ఆదాయం తక్కువే అయినా సరే.. ఇక్కడి ప్రజలు పిల్లల్ని పెంచడం ఎప్పుడూ భారంగా భావించరు. ఇక్కడ మన తన అనే భేదాలు లేకుండా ఒకరికొకరు సహాయం చేసుకుంటు వెళ్తుంటారు. అయితే ఇంకో విషయం ఏంటంటే.. ఇక్కడి డేకేర్ సెంటర్లు సైతం పిల్లల్ని కనడాన్ని ప్రోత్సహించే విధంగానే ఉంటాయి. భార్యభర్తలిద్దరూ ఉద్యోగాలు చేస్తున్న కుటుంబంలో అయితే.. వారి మొదటి బిడ్డను చూసుకునే డేకేర్ సెంటర్ కు నెలకు 420 డాలర్లను చెల్లిస్తారు. అదే రెండవ బిడ్డ సంరక్షణ కొరకు అయితే అందులో సగం చెల్లిస్తే సరిపోతుంది. మూడో బిడ్డను అయితే కేర్ సెంటర్ వారు ఉచితంగానే సంరిక్షిస్తారు. ఇదీ కాకుండా నామమాత్రపు చెల్లింపులతో పిల్లలను చూసుకునేందుకు వృద్ద మహిళలు కూడా ఉంటారు.

Aslo Read : Somu Veerraju: బీజేపీలోకి మాజీ సీఎం కిరణ్‌ కుమార్‌ రెడ్డి..? ఇలా స్పందించిన సోము వీర్రాజు

దీంతో పాటుగా ఇక్కడ ప్రభుత్వం ఉన్నత పాఠశాలలో చదువుతున్న ప్రతి బిడ్డకు సంవత్సరానికి దాదాపు 1,000 డాలర్లు అందిస్తుంది. ఈ మొత్తాన్ని పిల్లల తల్లిదండ్రులకు ఇస్తారు. అయితే జపాన్ మొత్తంలో ఈ జననాల రేటు 1.3 శాతంగా మాత్రమే ఉంది. దక్షిణ కొరియాలో అయితే గతేడాది కేవలం 0.78శాతంగా ఉంది. జపాన్ లో 2022 నాటికి జననాల సంఖ్య కంటే మరణాల సంఖ్య అధికంగా ఉంది. జనాభాలో భారీ క్షీణత ఇదే స్థాయిలో కొనసాగితే ఇప్పుడు పుట్టే పిలల్లకు భవిష్యత్ రకరకాల సమస్యలు వస్తాయని వెల్లడిస్తున్నారు.

Show comments