Jaish-e-Mohammad: జైషే “మహిళా జిహాదీ” యూనిట్ ప్రారంభం.. బాధ్యతలు చేపట్టిన మసూద్ అజార్ సోదరి..
- పాకిస్తాన్ ఉగ్ర సంస్థ కొత్త ప్లాన్ ప్రారంభం..
- జైషే మహ్మద్ మహిళా జిహాదీ యూనిట్..
- మసూద్ అజార్ సోదరి నేతృత్వంలో ఉగ్రవాద దళం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Jaish-e-Mohammad: పాకిస్తాన్ ఉగ్ర సంస్థ జైష్-ఏ-మొహమ్మద్(జెఎం) తన మహిళా ఉగ్రవాద విభాగాన్ని ప్రారంభించింది. జమాత్-ఉల్-మోమినాత్ అనే మొదటి మహిళా జిహాదీ విభాగాన్ని ప్రారంభించింది. దీనికి జైషే చీఫ్ మసూద్ అజార్ సోదరి సయీదా అజార్ నాయకురాలిగా బాధ్యతలు స్వీకరించింది. మహిళల్ని ఉగ్రవాదంలో తీసుకురావడం ద్వారా జైష్ తన ఉనికిని మరింత విస్తరించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలుస్తోంది. మే 7న భారత్ నిర్వహించిన ఆపరేషన్ సిందూర్ దాడుల్లో పాకిస్తాన్ బహవల్పూర్‌లోని జైషే ప్రధాన కార్యాలయం ధ్వంసమైంది. ఆ సమయంలో ఉగ్రవాదులతో సహా సయిదా భర్త మరణించాడు.
Also Read
- Iran War: F-15 కూల్చివేత వెనక చైనా హస్తం.. ఇరాన్‌కు డ్రాగన్ కంట్రీ సాయం..
- Petrol-Diesel Price Hike: ఆ దేశంలో లీటర్ పెట్రోల్ రూ. 434, డీజిల్ రూ. 407.
- Brahmos: చైనాకు బిగ్ షాక్.. వియత్నాం తర్వాత ఇండోనేషియా చేతుల్లోకి బ్రహ్మోస్..
- Paris Psg Violence: పీఎస్జీ గెలుపుతో తగలబడ్డ పారిస్.. వందల సంఖ్యలో ఫ్యాన్స్‌ను అరెస్ట్ చేసిన పోలీసులు!
ఇదిలా ఉంటే, సమాచారం ప్రకారం, ఉగ్రవాద సంస్థ నవంబర్ 9న ఉదయం 10 గంటలకు కరాచీలో ప్రత్యేక శిక్షణా శిబిరాన్ని నిర్వహించాలని ప్లాన్ చేస్తోంది. ముఖ్యంగా పేద మహిళల్ని, ఉగ్రవాదుల భార్యల్ని, చనిపోయిన ఉగ్రవాదుల కుటుంబంలోని మహిళల్ని రిక్రూట్ చేసుకునేందుకు జైష్ ప్రయత్నిస్తోంది. వీరికి ఉగ్రవాద శిక్షణ ఇచ్చి, తీవ్రవాద భావజాలాన్ని ప్రేరేపించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.
ఇదిలా ఉంటే, ఈ మహిళా ఉగ్రవాద కార్యకలాపాలకు పాకిస్తాన్ సైన్యం, పాక్ గూఢచార సంస్థ ఐఎస్ఐ మద్దతు ఇస్తున్నట్లు తెలుస్తోంది. కొత్త రకమైన ఉగ్రవాద దాడుల కోస మహిళల్ని ఉపయోగించుకోవాలని జైషే వ్యూహాలు పన్నుతోంది. ‘‘భారతదేశం మహిళల్ని సైన్యంలోకి తీసుకుంటుంది. మీడియా ద్వారా మనకు వ్యతిరేకంగా వాడుకుంటోంది. కాబట్టి మనం మన మహిళల్ని సిద్ధం చేయాలి’’ అని ఉగ్రసంస్థ విషబీజాలు నాటుతోంది.
తాజావార్తలు
-
Balcony Tips : బాల్కనీలో పావురాల లొల్లి ఎక్కువైందా.? ఈ సింపుల్ ట్రిక్స్‌తో గుడ్‌బై చెప్పేయండి.!
-
RCB Vs GT: నిప్పలు చెరుగుతున్న బెంగళూరు బౌలర్లు.. పెవిలియన్‌కు చేరిన ఓపెనర్స్..
-
LIC: ఎల్ఐసీ కొత్త వ్యూహం.. ఫిన్‌టెక్ రంగంలోకి ఎంట్రీ? ఫోన్‌పే, పేటీఎంకు పోటీగా సేవలు!
-
RCB vs GT Final: గుజరాత్ బ్యాటింగ్.. బెంగళూరు బౌలింగ్.. గుజరాత్ టీంలో కీలక మార్పులు..
-
Kodak QLED SE 80 cm: తక్కువ ధరలో QLED అనుభవం.. Kodak స్మార్ట్ టీవీపై రూ. 10 వేల డిస్కౌంట్
ట్రెండింగ్
-
Wash Basin Blocked : వాష్ బేసిన్ బ్లాక్ అయిందా.? ప్లంబర్ అవసరం లేకుండా ఈ చిట్కాలతో నిమిషాల్లో క్లియర్ చేయండి.!
-
Munakkaya Pachadi: ఆరోగ్యం + టెస్ట్ సూపర్ కాంబో.. ‘మునక్కాయ పచ్చడి’ చేసేయండి ఇలా.!
-
Airtel మాస్టర్ ప్లాన్.. రూ.469కే 84 రోజుల వ్యాలిడిటీ.. పూర్తి డీటెయిల్స్ ఇలా.!
-
Frog Control Tips : ఇంట్లోకి కప్పలు రాకుండా ఉండాలా? ఈ సింపుల్ చిట్కాలు పాటించండి.!
-
Tea Ranking : ప్రపంచాన్ని గెలిచిన భారతీయ చాయ్.. ‘నంబర్ 1’గా మసాలా టీ రికార్డ్..!