NTV Telugu Site icon

Italy PM Meloni: సామూహిక అత్యాచారాలపై వ్యాఖ్యలు..పార్ట్‌నర్‌తో విడిపోయిన ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీ..

Italy Pm Meloni

Italy Pm Meloni

Italy PM Meloni: ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీ తన భాగస్వామి, టెలివిజన్ జర్నలిస్ట్ ఆండ్రియా గియాంబ్రూనోతో విడిపోయినట్లు శుక్రవారం ప్రకటించారు. దాదాపుగా 10 ఏళ్ల పాటు ఆండ్రియా జియాంబ్రూనోతో కొనసాగిని నా సంబంధం ముగిసిందని మెలోని తన సోషల్ మీడియా ఖాతాలో రాశారు. తమ మార్గాలు ప్రస్తుతం వేరయ్యాయని, దానిని అంగీకరించే సమయం వచ్చిందని ఆమె పోస్టులో పేర్కొన్నారు. ఈ జంటకు ఒక కుమార్తె ఉంది.

జియాంబ్రూనో ఇటీవల మహిళలతో అసభ్యకరంగా మాట్లాడిని రికార్డింగ్స్ బయటకు వచ్చాయి. ఈ నేపథ్యంలో ఈ బంధానికి బీటలు పడ్డాయి. అయితే తన భాగస్వామి ప్రవర్తనతో తనపై ఒక అంచనాకు రావద్దని, అలాగే ఆయన ప్రవర్తనపై భవిష్యత్తలో తాను ఎలాంటి సమాధానాలు ఇవ్వనని ఇదివరకే జార్జియా తెలిపింది.

Read Also: Madhya Pradesh: మధ్యప్రదేశ్‌లో 81 శాతం ఎమ్మెల్యేలు కోటీశ్వరులే.. ఎక్కువగా ఈ పార్టీ వారే..

అంతకుముందు ప్రధాని మెలోనీ పార్ట్‌నర్ జియాంబ్రూనో సామూహిక అత్యాచారాలపై వివాదాస్పద వ్యాఖ్యలు చేయడంపై కూడా విమర్శలు వచ్చాయి. దేశంలో వెలుగు చూసిన అత్యాచార ఘటనలపై కీలక వ్యాఖ్యలు చేశారు. మీరు సరదాగా గడిపేందుకు వెళ్లినప్పుడు తాగుతారు, అయితే అప్పుడు అతిగా మద్యం సేవించకుండా ఉంటే మీరు ఇబ్బందుల్లో పడరు. అత్యాచారాలను నివారించాలంటే మీరు స్పృహ కోల్పోకుండా ఉండాలని వ్యాఖ్యానించారు.

ఈ వ్యాఖ్యలే విమర్శలకు కారణమయ్యాయి. మద్యం సేవించేందుకు, డ్రగ్స్ కోసం యువత బయటకు వెళ్లొద్దని చెప్పడమే తన ఉద్దేశ్యమని, చెడు వ్యక్తల నుంచి తప్పించుకునేందుకు ఇలాంటి వ్యాఖ్యలు చేశానని, ఇదే నా ఉద్దేశమని ఆయన ఈ వ్యాఖ్యల్ని సమర్థించుకునే ప్రయత్నం చేశారు. ఈ వ్యాఖ్యలతో ప్రధాని జార్జియా మెలోనిపై విమర్శలు వచ్చాయి. దీంతో 10 ఏళ్ల వీరి బంధం బీటలు వారింది. జార్జియా మెలోని ఇటలీకి తొలి మహిళా ప్రధాని, గతేడాది బ్రదర్స్ ఆఫ్ ఇటలీ పార్టీ తరుపున ఆమె ప్రధానిగా బాధ్యతలు స్వీకరించారు.

Show comments