NTV Telugu Site icon

Israel-Hamas war: గాజాపై ఇజ్రాయెల్ వైమానిక దాడి.. 12 మంది మృతి

Israelhamas War

Israelhamas War

గాజాపై ఇజ్రాయెల్ మారణహోమం సాగిస్తోంది. ఇప్పటికే గాజాను సర్వనాశనం చేసిన ఇజ్రాయెల్ సైన్యం.. యుద్ధాన్ని మాత్రం ఆపలేదు. శనివారం గాజాపై ఇజ్రాయెల్ వైమానిక దాడులు చేసింది. గాజాలోని డెయిర్ అల్-బలాహ్‌లో నిరాశ్రయులైన ప్రజలకు ఆశ్రయం కల్పిస్తున్న పాఠశాలపై వైమానిక దాడి చేసింది. దీంతో చిన్నారులు, మహిళలు సహా 12 మంది దుర్మరణం చెందారు. అనేకమంది పాలస్తీనా ప్రజలు గాయపడినట్లుగా అధికారులు వెల్లడించారు.

ఇది కూడా చదవండి: Cancers In India: భారత్‌లో పెరుగుతున్న “హెడ్ అండ్ నెక్” క్యాన్సర్లు.. 26 శాతం కేసులు..

తాజాగా వైమానిక దాడిలో డజన్ల కొద్దీ ప్రాణనష్టం జరిగి ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు. చాలా మంది తీవ్రంగా గాయపడినట్లుగా స్థానిక వర్గాలు పేర్కొన్నాయి. సహాయ బృందాలు రంగంలోకి దిగి శిథిలాల నుంచి బాధితులను తీసి అల్-అక్సా ఆసుపత్రికి తరలించారు. మృతుల సంఖ్య పెరగొచ్చని పేర్కొన్నారు.

ఇది కూడా చదవండి: Sidhu Jonnalagadda : అప్పుడు కనీకనిపించని పాత్ర.. ఇప్పుడేమో అతిధి పాత్ర!

అక్టోబర్ 7న హమాస్.. ఇజ్రాయెల్‌పై మెరుపుదాడికి పాల్పడింది. అంతే ఆ రోజు నుంచి ఇజ్రాయెల్ దాడులు చేస్తూనే ఉంది. ఇప్పటికే వందలాది మంది పాలస్తీనీయులు ప్రాణాలు కోల్పోయారు. వేలాది మంది గాయాలు పాలయ్యారు. ఇక లక్షలాది మంది నిరాశ్రయులయ్యారు. ఇంకోవైపు యుద్ధంపై చర్చలు జరుగుతూనే ఉన్నాయి. ఇదిలా ఉంటే ఇజ్రాయెల్ ప్రధాని నెతాన్యహు ప్రస్తుతం అమెరికాలో పర్యటిస్తున్నారు. ప్రస్తుత అధ్యక్షుడు బైడెన్‌తో భేటీ అయ్యాక.. మాజీ అధ్యక్షుడు ట్రంప్‌ను కూడా కలిశారు.

ఇది కూడా చదవండి: IPhone 16 Pro: ఐఫోన్‌ 16 ప్రో భారత్‌లోనే తయారీ.. యాపిల్‌ నిర్ణయంతో చైనాకు టెన్షన్!