Israel-Hamas War: గాజాపై అణుదాడి, ఇజ్రాయిల్ మంత్రి వ్యాఖ్యలు.. స్పందించిన పీఎం నెతన్యాహు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Israel-Hamas War: ఇజ్రాయిల్-హమాస్ మధ్య యుద్ధం కొనసాగుతూనే ఉంది. అక్టోబర్ 7న ఇజ్రాయిల్ పై గాజా హమాస్ మిలిటెంట్లు దాడి చేయడంతో 1400 మంది మరణించారు. 200 మందికి పైగా సాధారణ ప్రజల్ని బందీలుగా చేసుకున్నారు. దీని తర్వాత నుంచి ఇజ్రాయిల్ సైన్యం, గాజా స్ట్రిప్‌పై భీకర దాడులు చేస్తోంది. హమాస్‌ని పూర్తిగా కుప్పకూల్చే వరకు విశ్రమించేది లేదని ఇజ్రాయిల్ ఇప్పటికే ప్రకటించింది. గాజా మొత్తాన్ని ఇజ్రాయిల్ ఆర్మీ చుట్టుముట్టింది. ఇప్పటి వరకు ఇజ్రాయిల్ చేసిన దాడుల్లో 9000కు పైగా పాలస్తీనియన్లు మరణించారు.
ఇదిలా ఉంటే తాజాగా ఇజ్రాయిల్ హెరిటేజ్ మంత్రి అమిచాయ్ ఎలియాహు చేసిన ప్రకటన సంచలనంగా మారింది. హమాస్‌తో జరుగుతున్న పోరులో ‘అణు బాంబు వేయడం ఓ ఆప్షన్’ అని ఆయన అన్నారు. ఇజ్రాయిల్ లోని ఓట్జ్మా యెహుదిత్ పార్టీ సభ్యుడు, ఎలియాహు రేడియోకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ ప్రకటన చేశారు.
Also Read
- Pakistan: పిల్లలపై అత్యాచారం, ట్రాఫికింగ్ నిందితుడు.. PoK ఎన్నికల్లో గెలుపు..
- Forbes Best Under a Billion 2026: చైనాకు ఒక్క అడుగు దూరంలో భారత్.. ఫోర్బ్స్ జాబితాలో టాప్-200లో 27 సంస్థలు
- Modi-Netanyahu: మోడీకి నెతన్యాహు ఫోన్.. ఉద్రిక్తతల వేళ కీలక సంభాషణ
- UK: ఆర్మీ కాలేజీలో మహిళలపై అత్యాచారాలు.. యూకేను కుదిపేస్తున్న ఘటన..
Read Also: Mumbai: మ్యాట్రిమోనియల్ సైట్‌లో పరిచయం.. మహిళపై పలుమార్లు అత్యాచారం…
అయితే మంత్రి చేసిన ప్రకటనపై ఇజ్రాయిల్ పీఎం బెంజిమిన్ నెతన్యాహూ తీవ్రంగా స్పందించారు. ఆయన వ్యాఖ్యల్ని నిందించారు. ఇజ్రాయిల్, ఇజ్రాయిల్ డిఫెన్స్ ఫోర్సెస్(ఐడీఎఫ్) అమాయకులకు హాని కలిగించకుండా ఉండటానికి అంతర్జాతీయ చట్టం, అత్యున్నత ప్రమాణాలకు అనుగుణంగా పనిచేస్తుంది, మా విజయం వరకు మేము దీన్ని కొనసాగిస్తామని ఎక్స్(ట్విట్టర్)లో పేర్కొన్నారు. ఇజ్రాయిల్ ప్రతిపక్ష నాయకుడు, మాజీ ప్రధాని యాయిర్ లాపిడ్ కూడా ఎలియాహుని విమర్శించారు. బాధ్యతా రహిత మంత్రిని తొలగించాలని పిలుపునిచ్చారు.
గాజా నివాసితులన ‘నాజీలు’గా పిలుస్తూ, వారికి మానవతా సాయం కూడా అందించడాని ఎలియాహు వ్యతిరేకించారు. గాజాను తిరిగి స్వాధీనం చేసుకుని అక్కడ నివాసాలను పునరుద్ధరించాలని, గాజా ఇజ్రాయిల్‌కు వస్తే, గాజాలోని రాక్షసులు ఎడారులకు వెళ్లవచ్చని ఎలియాహు అన్నారు. ఉత్తర గాజా ప్రాంతం ఉనికిలో ఉండే హక్కు లేదని వ్యాఖ్యానించారు. అయితే నష్ట నివారణ చర్యల్లో భాగంగా నెతన్యాము మంత్రి వర్గ సమావేశాల నుంచి మంత్రిని నిరవధికంగా సస్పెండ్ చేసినట్లు టైమ్స్ ఆఫ్ ఇజ్రాయిల్ నివేదించింది.
తాజావార్తలు
-
Jobs In Hydraa: హైడ్రాలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్.. ఆగస్టు 8, 9 తేదీల్లో నేరుగా ఎంపిక ప్రక్రియ..
-
Pakistan: పిల్లలపై అత్యాచారం, ట్రాఫికింగ్ నిందితుడు.. PoK ఎన్నికల్లో గెలుపు..
-
Mohan Bhagwat: స్వలింగ వివాహాలపై మోహన్ భగవత్ సంచలన వ్యాఖ్యలు
-
Agni-4 Ballistic Missile: పాకిస్తాన్ మొత్తం భారత పరిధిలో.. అగ్ని-4 మిస్సైల్ సక్సెస్..
-
Forbes Best Under a Billion 2026: చైనాకు ఒక్క అడుగు దూరంలో భారత్.. ఫోర్బ్స్ జాబితాలో టాప్-200లో 27 సంస్థలు
ట్రెండింగ్
-
రూ.9.99 లక్షలకే పెట్రోల్, డీజిల్, CNG ఆప్షన్లతో Tata Nexon Camo ఎడిషన్ లాంచ్..!
-
6.99 అంగుళాల 120Hz OLED డిస్ప్లే, 8,000mAh బ్యాటరీతో REDMI Note 17 5G లాంచ్..!
-
Crispy Wheat Flour Snacks: బయటి జంక్ ఫుడ్‌కి బై..బై.. ఇంట్లోనే గోధుమపిండితో కరకరలాడే హెల్తీ స్నాక్స్ చేసేయండి ఇలా.!
-
Best EV Bikes: బెస్ట్ మైలేజ్, అదిరే ఫీచర్లతో రూ.1.50 లక్షలలోపు కొనుగోలు చేయగల టాప్-5 EV బైక్‌లు ఇదిగో..!
-
Incredible Story: దేశవాళీ క్రికెట్లో 9 వేల రన్స్.. టీమిండియా డెబ్యూలోనే హాఫ్ సెంచరీ.. కానీ అడ్రస్ లేకుండా పోయిన ఓపెనర్!